సాహితి

సాంఘిక పరిణామంలో స్ర్తి పురుష సంబంధాల పాత్ర(శ్రీ విరించీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషిని మనిషి కాల్చుకు తినడం మానవ చరిత్రలో సర్వసాధారణమైన విషయమే. అయినా ఇందుకు కులాలు, వర్గాలు, వాటిమధ్య ఉండే అభిప్రాయ భేదాలు కారణం అనుకోవడం కూడా సాంఘిక పరిణామంలో భాగం అయిపోయింది.
1915లో పుట్టిన పార్వతీశం అనే అతను ‘‘తన తండ్రిలాగా తన వర్గానికి అనుకూలించని సంస్కారం యిచ్చే చదువులు చదివాడు. దరిద్రుల దారిద్య్రానికి, నిరక్షరుల నిరక్షరతకు, స్ర్తిల అధోగతికి బాధ్యత భగవంతుడిది కాదనీ, సంఘంలో పెద్దలయిన వారిదనీ తెలుసుకోవడమే కాక తన వర్గం యొక్క సంస్కారాన్ని సహృదయం లేకుండా చూచాడు’’.
తెలుగు కథా ప్రపంచాన్ని తన సరికొత్త ఆలోచనలతో అనేక మలుపులు తిప్పిన కొడవటిగంటి కుటుంబరావు వ్రాసిన ‘అర్థాంగి’ కథానికలో పాత్ర ఈ పార్వతీశం. అతడు ‘‘మధ్య తరగతి ప్రజలకు ప్రతినిధి. అతనికి పద్ధెనిమిదో యేట వాళ్ల వాళ్లు పనె్నండేళ్ల పిల్లనిచ్చి పెళ్లిచేశారు. ఈ పిల్ల మరో రెండేళ్లలో కాపురానికి వచ్చింది. ఆమె పేరు శకుంతల’’. పార్వతీశం అంచనాలలో వచ్చిన తప్పు ఏమిటంటే ‘అతను ఆమెకు తనకున్న జ్ఞానంగాని, ప్రపంచ జ్ఞానంగాని లేదని’ తెలుసుకోలేకపోవడం. ‘తనకున్న సాంఘిక విలువలే ఆమెకూ వుంటాయని ఎందువల్లనో మనసు పడ్డాడు. అతని ప్రేమ కలాపం అంత ఆమెకు లొంగుబాటుగా కనిపించింది. వివాహ సంబంధాలను కూడా వర్తక వాణిజ్యాల పద్ధతికి దిగజార్చి తన మొగుడు కేవలం శరీరానికి దాసుడు అనుకున్నది తప్ప అతను సంస్కారాన్ని, సహృదయాన్ని అర్థం చేసుకోలేకపోయింది. ఫలితంగా అతనికి మూడేళ్లు కాపురం చేసిన మీద, తన భార్య వొట్టి అడవి మొద్దనీ, తనను, తన సంస్కారాన్ని తీరని అవమానం చేస్తోందని గ్రహించాడు. ‘‘అతనికి పెళ్లాంమీద, సంసారంమీద, శరీర సుఖంమీద, సంఘంమీద, సృష్టిమీద, దేవుడిమీద కూడా విరక్తి కలగసాగింది’’. ఇటువంటి స్థితిలో అతనికి ‘వెకిలి మనిషి’ అయినా ‘మంచి హృదయం’ కల ఒక ప్లీడర్ గుమాస్తా భార్యతో సంపర్కమేర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న శకుంతల అతన్ని వేధించడం, అనరాని మాటలు అనేకం అనడం ప్రారంభించింది. అంతేకాదు, తన భర్త చేస్తున్న ఈ దురాచారాన్ని ప్రజలందరికీ బాహాటంగా చెప్పడం కూడా మొదలెట్టింది. భార్యను వదిలించుకోవాలని పార్వతీశం ఎంతో ప్రయత్నం చేశాడు కాని ఆమె ససేమిరా అందుకు సహకరించలేదు. అతను ఆ ఉద్రేకంలో ‘ఆమె యింకెవరితోనయినా లేచిపోయినా బాగుండును’ అని తలపోయసాగాడు. అయినా వేరే దారిలేక, ఆర్థిక స్థితిగతులు కూడా అంతగా అనుకూలం కాదు గనుక ఆమెతో పదమూడేళ్ళు కాపురం కొనసాగించాడు. అతనికి ఒక జ్యోతిష్యుడితో పరిచయం ఏర్పడి కొన్ని కొత్త విషయాలు బయటపడినట్లయింది. అతను జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పడమే కాక ‘మీకు పదహారేళ్ల క్రితం ఆరంభమయిన శని యింకా మూడేళ్లలో వదులుతుంది’ అని ఆశాకిరణం కలిగించాడు. ‘ఎంత సంస్కారమూ, ఎన్ని ప్రణయాలు ఇవ్వలేని ఆనందం ఈ మాటతో పార్వతీశానికి కలిగింది’.
భార్య ఇంకో మూడేళ్లకు చనిపోతుందనీ, అపుడు తనకు పూర్తిగా స్వేచ్ఛ వస్తుందనీ, ‘మరో రెండేళ్లు ఆయుర్దాయం ఇస్తే చాలు, ఆ రెండేళ్లూ నాకు కావలసినట్లు బతుకుతాను’ అనుకున్నాడు పార్వతీశం. అప్పటినుండి పూర్వం మాదిరిగానే భార్యతో సంసార సుఖం- పశువులా గాక, ‘ఏ మాత్రం నాజూకు, సంస్కారం లేకుండా’ కొనసాగించాడు. శకుంతలకు రుూ ప్రవర్తన సర్వసాధారణంగా, సజావుగా అయినదిగానే కనిపించసాగింది. ‘తనను అర్థాంగిగా చేసుకోలేకపోయినా పార్వతీశం ఆమెకు అర్థాంగి అయినాడు.
కుటుంబరావుగారు ఈ కథకు కొసమెరుపు ఇచ్చిన పద్ధతి గణనీయం అయినది.
‘ఆమె ఇప్పుడు కడుపుతూ వుంది- ఇనే్నళ్ళకి.’
‘ఈ విషయం ఎందుకో జ్యోతిష్కుడు చెప్పలేదు’ అని పార్వతీశం అర్థ స్వగతంగా సమాధానపడి వూరుకున్నాడు.
ఇంతకూ భార్యాభర్తల సంబంధాలలో పరస్పర సహకారం, సదవగాహన, అభిప్రాయాలు కలబోసుకోవడం అవసరం అన్న విషయాన్ని రుూ కథానిక చెప్పక చెపుతుంది. సజావుగా సాగే సంసారాలన్నీ రుూ లక్షణాలను పుణికిపుచ్చుకుంటాయి. సంస్కరణభావాలు ఏవీ చక్రగతం కాకూడదు. సంస్కరణకర్త సమస్యకు తగుమాత్రం సమాధానాన్ని ఆలోచించించి పెట్టుకు కూర్చోవడం అవసరం అని కూడా ఈ కథ సూచన ఇస్తుంది.
కుటుంబరావుగారి ప్రతి కథ ‘నమూనా కథ’ అన్న విషయం లోగడ నేను ఎన్నోమార్లు చెప్పాను. ప్రతి కథా, జీవితంలోంచి పుట్టి, మనిషి మనసులో మెదిలి, హృదయాన్ని కదిలించి కొత్త కోణాలను చూపిస్తుంది.

- శ్రీవిరించి, 9444963584