జాతీయ వార్తలు

వ్యక్తిగత స్వేచ్ఛపై రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడానికి వీల్లేదు. కొన్ని కేసుల విషయంలో ప్రభుత్వ దృష్టిలో ఇది న్యాయమే కావచ్చు కానీ వ్యక్తిగత స్వేచ్ఛపై రాజీకి ఆస్కారమే ఉండదు’అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. అవినీతి కేసును ఎదుర్కొంటున్న అస్సాం పబ్లిక్ సర్వీసు కమిషన్ మాజీ చైర్మన్ రాకేశ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా త్రిసభ్య సుప్రీం బెంచి మెజార్టీ తీర్పులో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ కేసును విచారిస్తున్న ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఆయన్ని సహేతుక షరతులతో విడుదల చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి పూర్తిస్థాయిలో సాంకేతిక కోణంలో వ్యవహరించడానికి వీల్లేదని, వ్యవహరించకూడదని, ఇలాంటి వ్యవహారాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకే మొగ్గు చూపాలని జస్టిస్ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలు తమ మెజార్టీ తీర్పులో ఉద్ఘాటించారు. ఒకరికి న్యాయమైనది మరొకరికి అన్యాయం కావచ్చునని పేర్కొన్న న్యాయమూర్తులు ‘పదేళ్ల పాటు శిక్ష వేయడానికి వీలున్న నేరంలో అరెస్టయిన నిందితుడ్ని అరెస్టు చేసిన 60రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయడంలో పోలీసులు విఫలమైతే నేర శిక్షాస్మృతిలోని 167 (2)(ఎ)(2) సెక్షన్ కింద డిఫాల్డ్ బెయిల్ (స్టాట్యుటరీ బెయిల్)పొందే హక్కు ఉంటుంది’అని స్పష్టం చేశారు. ఈ అంశంపై పిటిషనర్‌ను విడుదల చేయాలని జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలు ట్రయల్ కోర్టును ఆదేశించారు. మరో న్యాయమూర్తి పిసి పంత్ ఈ అప్పీలను డిస్మిస్ చేశారు. పిటిషనర్‌కు డిఫాల్ట్ బెయిల్ పొందేందుకూ అవకాశం లేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనతో తాము ఏకీభవించడం లేదని న్యాయమూర్తులు తమ మెజార్టీ తీర్పులో స్పష్టం చేశారు.తన బెయిల్ దరఖాస్తులను గౌహతి హైకోర్టు రెండు సార్లు తిరస్కరించడంతో పిటిషనర్ రాకేష్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవినీతి నిరోధక చట్టం కింద దాఖలైన పలు కేసులకు సంబంధించి రాకేష్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి గత ఏడాది నవంబర్‌లో అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 24న ఆయనపై చార్జిషీట్ దాఖలైంది. ఎలాంటి చార్జిషీటు దాఖలు చేయకుండా ఓ నిందితుడ్ని గరిష్ట స్థాయిలో రెండు నెలల పాటు నిర్బంధంలో ఉంచవచ్చా లేక 90రోజుల పాటు కస్టడీని కొనసాగించవచ్చునా అన్న అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. మెజార్టీ తీర్పుతో విభేదించిన జస్టిస్ పంత్ ‘పిటిషనర్‌పై వచ్చిన ఆరోపణలు కేవలం ఆర్థిక పరమైన నేరాలకు పరిమితమైనవి మాత్రమే కాదు. ఈ నేరం వల్ల బాధితులైన వారి రాజ్యాంగ హక్కుల్ని కూడా ఉల్లంఘించడమే’అని అన్నారు.
చిత్రం.. న్యాయమూర్తులు మదన్‌లోకుర్, పిసి పంత్, దీపక్ గుప్తా