జాతీయ వార్తలు

విద్యకు తరగని నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వసూలు చేస్తున్న విద్యా సెస్‌ను ఒక ప్రత్యేక నిధిగా ఏర్పాటు చేసి, వార్షిక కేటాయింపులు ద్వారా ఎన్నడూ మురిగిపోని విధంగా దానిని కార్పస్ ఫండ్‌గా రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయిలో పాఠశాల విద్య , మాధ్యమిక విద్య, ఉన్నత విద్యకు ఎన్నడూ మురిగిపోని విధంగా ఈ కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసేందుకు వీలుగా 2007 ఆర్థిక చట్టం సెక్షన్ 136ను సవరించారు. 2004 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా రెండు శాతం మేర విద్యాసెస్‌ను వసూలుచేస్తున్నారు. ఉన్నత విద్యకు సమానంగా మాధ్యమిక విద్యాభివృద్ధికి సైతం విద్యాసెస్‌ను కనీసం ఒక శాతం వసూలు చేయాలని కేంద్రం 2007లో నిర్ణయించింది. విద్యారంగం అవసరాలను తీర్చేందుకు వసూలు చేస్తున్న ఈ నిధులు ఖర్చు కాకపోవడంతో మురిగిపోవడం, లేదా వేరే విభాగాలకు మళ్లించడం జరుగుతోంది. దాంతో ఎన్నటికీ మురిగిపోని రీతిలో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మాధ్యమిక ఉచ్ఛార్ శిక్షా కోష్ (ముస్కు) పేరిట ఈ నిధిని ఏర్పాటు చేస్తారు. మాధ్యమిక, ఉన్నత విద్యారంగంలో ఉన్న విద్యార్థుల అవసరాల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు. ఇక మీదట ఈ నిధుల వ్యవహారాలను మానవ వనరుల మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది. మరో పక్క ఈ నిధులను ప్రస్తుతం అమలులో ఉన్న విద్యాపథకాలకు కూడా వెచ్చిస్తారు. కేంద్రం తన బడ్జెట్ నిధులను కేటాయించిన తర్వాత అంతకుమించి వ్యయం అయితే అదనపు నిధులను మాధ్యమిక విద్యాశాఖ ఈ కార్పస్ ఫండ్ నుండే వెచ్చించాలి. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకం, నేషనల్ స్కీం ఫర్ బాలికల సహాయ పథకం, రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్, నేషనల్ మిషన్ ఆన్ టీచర్స్ ట్రైనింగ్ తదితర పథకాలకు ఈ నిధులను వెచ్చిస్తున్నారు. దీంతో పాటు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఏ ఇతర పథకానికైనా ఈ నిధులు వెచ్చించే వీలుంది.