జాతీయ వార్తలు

చెప్పేందుకేమీ లేకనే కుదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజు పైనుంచి చేసిన ప్రసంగం ఇప్పటివరకు ప్రధానమంత్రులందరూ చేసిన ప్రసంగాలకన్నా తక్కువ వ్యవధి గల ప్రసంగమని, చెప్పుకోవడానికి ఏమీ లేనందునే ఆయన తన ప్రసంగాన్ని కుదించారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ ప్రసంగించినప్పుడు అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉన్నారని, అది చాలా తక్కువ సమయం ప్రసంగమని ఆమే ఆ తర్వాత తనకు చెప్పారని ఆయన అన్నారు. ‘చెప్పడానికి ఏమీ లేనందు వల్లనే ప్రధాని మోదీ తన ప్రసంగ సమయాన్ని తగ్గించుకొన్నారు’ అ బుధవారం బెంగళూరులో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ రాహుల్ అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందకపోవడం కారణంగా 90 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన విషయాన్ని ప్రధాని దేశ ప్రజలకు ఎందుకు చెప్పలేదని రాహుల్ ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం వైద్య సేవల బడ్జెట్‌ను భారీగా తగ్గించిందని, ఈ కారణంగానే ఆస్పత్రులకు సదుపాయాలు కరువైనాయని అన్నారు. కొద్ది రోజుల క్రితం తాను గోరఖ్‌పూర్ వెళ్లానని, అక్కడి ఆస్పత్రులకు మద్దతు అందజేయాలని తాను అప్పుడు కోరానని, అయితే ప్రధాని స్పందించలేదని అన్నారు. గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువగా నిరుద్యోగం దేశంలో ఇప్పుడున్న విషయాన్ని ప్రధాని తన ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని కూడా ఆయన అన్నారు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన మోదీ ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పడం లేదన్నారు.
మరోవైపు మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై కూడా రాహుల్ తీవ్రంగా ధ్వజమెత్తారు. భారత్‌కు సన్నిహితంగా ఉండిన దేశాలు సైతం ఇప్పుడు దూరమవుతున్నాయని ఆయన చెప్పారు. మేము అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్, చైనా తప్ప అన్ని పొరుగు దేశాలు కూడా మన దేశానికి అనుకూలంగా ఉండేవి. ప్రధాని మోదీ ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని దూరం చేసుకున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారి రష్యా పాకిస్తాన్‌కు ఆయుధాలను విక్రయిస్తోందన్నారు. ఇప్పుడు నేపాల్ కూడా మనకు దూరమైందని, మరోవైపు శ్రీలంకలో చైనా పోర్టును నిర్మిస్తోందని చెప్పారు.
ప్రధాని మోదీ దేశాన్ని చీలుస్తున్నారని రాహుల్ దుయ్యబట్టారు. ‘ఆయన పార్టీ మనుషులు దళితులను చితకబాదుతున్నా, మైనారిటీలను చెంపేస్తున్నా ఆయన మాత్రం వాటిని ఖండించడం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
ఇందిరా క్యాంటీన్ ప్రారంభం
బుధవారం రాహుల్ గాంధీ నగరంలో కర్నాటక ప్రభుత్వం సబ్సిడీ క్యాంటీన్లు (ఇందిరా క్యాంటీన్) ప్రారంభించారు. ఈ క్యాంటీన్లలో 5 రూపాయలకు టిఫిన్, పది రూపాయలకు భోజనం లభిస్తాయి. త్వరలో రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో కూడా వీటిని ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్రం ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది.
చిత్రం.. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఇందిర క్యాంటీన్’లో సబ్సిడీ భోజనం చేస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. చిత్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బెంగళూరు నగర మేయర్ తదితరులు