జాతీయ వార్తలు

వ్యక్తిగత కారణాలతోనే రోహిత్ వేముల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు) పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు అనేక కారణాలున్నట్టు జస్టిస్ రూపన్‌వాలా కమిటీ పేర్కొంది. రోహిత్ ఆత్మహత్యకు గల కారణాలను కనుకొనేందుకు ఏర్పాటు చేసిన మాజీ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూపన్‌వాలా ఏకసభ్య కమిషన్ నివేదికను కేంద్ర మానవ వనరుల శాఖకు సమర్పించారు. రోహిత్ వేముల యూనివర్సిటీ చర్యలవల్ల చనిపోలేదని, వ్యక్తిగత ఇబ్బందులు తదితర కారణాలవల్ల నిరుత్సాహం, ఒత్తిడికి గురయ్యాడని, అవే ఆత్మహత్యకు దారితీశాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలకు ఎటువంటి సంబంధం లేదని కూడా కమిషన్ నివేదికలో పేర్కొంది. రోహిత్ దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కాదనే అభిప్రాయం కూడా కమిటీ నివేదికలో వెల్లడించారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లేఖలో అతడు ఒత్తిడిలో ఉన్నట్టు, అలాగే అతని ఆత్మహత్యకు ఎవర్ని కారణంగా పేర్కొనలేదని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ అతనిపై తీసుకున్న చర్యలకు అగ్రహం ఉంటే, లేఖలో స్పష్టం చేసేవాడని, అలా జరగలేదని, దీనినిబట్టి ఆ సమయంలో యూనివర్సిటీలో ఉన్న పరిస్థితులు ఆత్మహత్యకు కారణాలు కాకపోవచ్చునని నివేదికలో పేర్కొన్నారు. యూనివర్సిటిలో సాధారణ విద్యార్థులతోపాటు, రిజర్వుడు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎటువంటి యంత్రాగం లేదని కమిషన్ వెల్లడించింది. పైగా రోహిత్ వేములపై యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్న చర్యలను కమిషన్ సమర్థించింది. అలాగే విద్యార్థులు తమ చదువులపై దృష్టి సారించాలని, ఇతర అంశాలపై దృష్టి పెట్టకూడదనే ఉద్దేశంతో ఆ చర్యలు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. రోహిత్‌పై చర్యల విషయంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్వతంత్రంగానే వ్యవహరించిందని, ఎటువంటి ఒత్తిళ్లు లేవని నివేదిక పేర్కొంది.