శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రెవెన్యూ, అటవీ శాఖల నిర్లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపురం: ఏళ్ల తరబడి ఆ భూములు తమ శాఖవని తెలుసుకోని అటవీశాఖ నిర్లక్ష్యానికి, అవి ఏ భూములో చూడకుండానే కళ్లుమూసుకొని పట్టాలిచ్చిన రెవెన్యూ శాఖ నిర్లక్ష్యానికి రైతులు బలికానున్నారు. ఏళ్ల తరబఢి కష్టపడి సాకిన నిమ్మ, మామిడిచెట్లు చేతికి అందివచ్చే సమయానికి ఆ భూములు తమవని, వెంటనే ఖాళీ చేయాలంటూ అటవీశాఖ అదికారులు అంటుండగా, ఆ భూములు తమవని పట్టాలిచ్చేశామంటూ పట్టాలిచ్చిన రెవిన్యూ శాఖ చోద్యం చూస్తుండటంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. మండలంలోని తోచాం గ్రామంలో సర్వే నంబర్ 41-పిలో పాతికేళ్ల క్రితమే రెవెన్యూ శాఖ పట్టాలిచ్చింది. పట్టాలిచ్చిన పొలంలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇటీవల అటవీ శాఖ వారు ఆ భూములు తమవని, వాటిని జాయింట్ సర్వే చేసి అప్పగించాలని రెవిన్యూ శాఖను కోరారు. దీంతో అటవీ, రెవెన్యూ శాఖలు పలు పర్యాయయాలు సంయుక్త సర్వే చేసి 180 ఎకరాల భూమిని అటవీ భూమిగా గుర్తించారు. దీంతో అందులో సాగు చేసుకొంటున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెవెన్యూ శాఖ తమకు పట్టాలిచ్చి పాసు పుస్తకాలు కూడా ఇచ్చారని, అందులోనే తాము సాగు చేసుకొంటున్నామని, రెవిన్యూ అధికారులు చేసిన తప్పిదానికి తాము బాధ్యులెలా అవుతామని రైతులు ప్రశ్నిస్తున్నారు. అటవీశాఖకు తమ భూములు అప్పగించాలంటే తమకు పరిహారంతో పాటు ప్రత్యామ్నాయం చూపాలని రైతులు అధికారులను కోరుతున్నారు.