హైదరాబాద్

రూటు మార్చిన డ్రగ్ మాఫియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో కొత్త డ్రగ్ దందా వెలుగులోకి వచ్చింది. డ్రగ్ మాఫియా గంజాయి, కొకైన్, ఎల్‌ఎస్‌డి, ఎల్‌ఎస్‌ఎండి వంటి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుండడంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గట్టి నిఘా పెట్టడంతో డ్రగ్ మాఫియా మరో కొత్త డ్రగ్ దందాకు తెరలేపింది. ‘ఖత్రా’ అనే కాడ, ఆకులు కలిగి గంజాయితో పోల్చి ఉండే మాదకద్రవ్యాన్ని నగర యువతకు అలవాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
కొకైన్ ఒక గ్రాముకు రూ. 2వేల నుంచి 5వేల వరకు విక్రయించిన డ్రగ్ ముఠా సభ్యులు, కొత్తగా వచ్చిన ఖత్రా మాదకద్రవ్యం ఒక గ్రాముకు రూ. 2నుంచి 6వేల వరకు అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో డ్రగ్ మాఫియాకు కొకైన్ కంటే ఎక్కువ లాభాలు పొందుతున్నట్టు సమాచారం. కొకైన్, ఎల్‌ఎస్‌డి చేతి గోళ్లలో..నాలుకపై వేసుకుని మత్తులో మునిగిపోగా, కొత్తగా వచ్చిన ఖత్రా డ్రగ్ ఇది ఆకులు, కాడల రూపంలో ఉండి..సిగరెట్టులోని పొగాగు తీసి లోడ్ చేసుకునే విధంగా, లేదా ఆకులు, కాడను కాల్చి గ్లాసు సోడాలో కలుపుకుని ద్రవ పదార్థంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు కొత్తగా వచ్చిన ఖత్రా వంటి మత్తుపదార్థంపై కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం.