హైదరాబాద్

కాస్త జవాబుదారీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సాధారణంగా ఒకరు వినియోగించి పక్కన పారేసే వస్తువులు ఇతరులకు ఎంతో అవసరంగా మారుతాయి. అంతేగాక, మన నిత్యం జీవితంలో వినియోగించే పుస్తకాలు, దుస్తులు, బూట్లు, స్వెట్టర్లు వంతి ఇతరాత్ర సామాగ్రిని వినియోగించిన తర్వాత రోడ్డుపై ఇష్టారాజ్యంగా పారవేయకుండా ఓ పద్దతి ప్రకారం అవి అవసరమున్న వారికి అందించేందుకు జిహెచ్‌ఎంసి ప్రారంభించిన ‘వాల్ ఆఫ్ కైండ్‌నెస్’ సేవా కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. మొట్టమొదటి రాజేంద్రనగర్ సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి చక్కటి స్పందన వస్తుండటంతో నగరంలోని అన్ని సర్కిళ్లలో అమలు చేశారు. మనం వాడిన వస్తువులను సమీపంలోని ఓ ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ పెడితే, అవి అవసరమున్న వారు అక్కడకొచ్చి తీసుకోవటమే ఈ ‘వాల్ ఆఫ్ కైండ్‌నెస్’ సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అయితే నగరంలోని 30 సర్కిళ్లలో కూడా ఇలాంటి గోడలను ఏర్పాటు చేసి, దీనికి విస్త్రృత ప్రచారం కల్పించటంతో ఈ గోడల వద్ద స్థానికులు పెడుతున్న కొన్ని వస్తువులు అవసరం లేని వారు ఎత్తుకెళ్లటం, మరికొందరు వాటిని నాశనం చేయటం వంటివి జరుగుతున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు గుర్తించారు. ఇలా జరగకుండా ఈ సేవా కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా, పారదర్శకతగా, జవాబుదారితనంతో నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఇందుకు గాను ప్రతి సర్కిల్‌లో ‘వాల్ ఆఫ్ కైండ్‌నెస్’ గోడను ఏర్పాటు చేసిన ప్రాంతంలో స్థానికులను ఒకర్ని కైండ్‌నెస్ వలంటీర్‌గా నియమించేందుకు జిహెచ్‌ఎంసి చర్యలు చేపట్టింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సేవా చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తే వారి సేవలను ఉచితంగా పొందాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. రిటైర్డు ఉద్యోగులు తమకు సమయం దొరికినపుడల్లా ఈ వాల్ ఆఫ్ కైండ్‌నెస్ వద్దనున్న సామానులను చూస్తూ, అవి అవసరమైన వారికందించేందుకు వీలుగా విధులు నిర్వహించేందుకు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదివరకు అమలు చేసిన ఈ వాల్ ఆఫ్ కైండ్‌నెస్ కార్యక్రమంలో ఎవరికి బడితే వారు తమకు వద్దనుకునే వస్తువులను ఈ గోడ వద్ద వదిలి వెళ్లటం, అవసరమైన వారు అక్కడకొచ్చిన వారికి అవసరమైన వస్తువులను పట్టుకెళ్లటం జరిగేది. కానీ ఇక మున్ముందు ఈ కార్యక్రమాన్ని లెక్కపత్రాలతో, వస్తువులు ఇచ్చే వారి, వాటిని తీసుకెళ్లే వారి వివరాలను ఓ పుస్తకంలో నమోదు చేసుకోవాలని, ఈ బాధ్యతలను స్థానిక కైండ్‌నెస్ వలంటీర్లను నియమించి వారికి అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.
ఆసక్తి ఉంటే నమోదు చేసుకోవచ్చు
సేవా దృక్పథంతో కైండ్‌నెస్ వలంటీర్లుగా సేవలందించాలన్న ఆసక్తి కల్గిన వారు తమ స్థానిక సర్కిల్ కార్యాలయంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. జిహెచ్‌ఎంసి చేస్తున్న సేవా కార్యక్రమంలో రిటైర్టు ఉద్యోగులు సైతం తమవంతు సహాకారాన్ని అందించి ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.

అంభీర్ చెరువు పరిశీలించిన సిపి సందీప్ శాండిల్య
జీడిమెట్ల: బాచుపల్లి మండలంలోని ప్రగతినగర్ గ్రామ అంభీర్ చెరువును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య పరిశీలించారు. అధికారుల ఏర్పాట్లను, గణపతుల నిమజ్జన చేసే ప్రక్రియను తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిపి ఆదేశించారు. సిపితో పాటు బాచుపల్లి సిఐ బాలకృష్ణారెడ్డి, కెపిహెచ్‌బి సిఐ కుషాల్కర్, ఎస్సైలు పాల్గొన్నారు.

నగర టిడిపి ఆఫీసులో నంద్యాల గెలుపు సంబరాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్: ఆంధ్రలో అధికార తెలుగుదేశం పార్టీని గెలిపించిన నంద్యాల ప్రజలు అభివృద్ధి, ప్రజాసంక్షేమానికే పెద్దపీట వేశారని నగర టిడిపి అధ్యక్షుడు ఎం.ఎన్.శ్రీనివాస్‌రావు వ్యాఖ్యానించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి 27వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించటంతో ఇందిరాపార్కు వద్దనున్న సిటీ ఆఫీసులో ఎంఎన్ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో తెలుగుతమ్ముళ్లు మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎన్.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రత్యర్థి రాజకీయపార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, నంద్యాల ప్రజలు టిడిపి పార్టీని గెలిపించటం, ప్రజల్లో ఆ పార్టీకున్న ఆదరణకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు సాయిబాబా, వనం రమేశ్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు షకీలారెడ్డి, అధికార ప్రతినిధి నల్లెల కిషోర్, జి మధు తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
కెపిహెచ్‌బి కాలనీ : తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కూకట్‌పల్లిలో టిఆర్‌ఎస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు టిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ సీఎం కెసీ ఆర్‌పై, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తప్పిన పెను ప్రమాదం
శంషాబాద్: నగర శివారు ప్రాంతమైన శంషాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాళ్ళగూడలో పెను ప్రమాదం తప్పింది. రెండు ఆటో ట్రాలీలు అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి 33-11 కెవి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నాయి. దీంతో విద్యుత్ స్తంభం కూలి ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ఈ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంతో అక్కడ చాలాసేపు రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

బిల్డర్‌ను అరెస్టు చేసి అధికారులను శిక్షించాలి

సత్యనారాయణ ఎన్‌క్లేవ్ అసోసియేషన్ డిమాండ్
శేరిలింగంపల్లి: నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ తవ్వి తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్న బిల్డర్‌ను అరెస్టు చేయాలని, తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ ఎన్‌క్లేవ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమవారం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ అధ్యక్షురాలు ఇందిర, నాయకులు నర్సింగరావు, రాధాకృష్ణ, ప్రసాద్, శేషు, భువన, మూర్తి, సభ్యులు, అపార్టుమెంట్ వాసులు మాట్లాడుతూ శ్రీ తిరుమల ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించనున్న మల్టీప్లెక్స్ కోసం 26 అడుగుల సెట్‌బ్యాక్ వదలకుండా తమ అపార్టుమెంట్ ప్రహరీని ఆనుకుని 30 అడుగుల లోతు సెల్లార్ తవ్వడం వల్లనే ప్రమాదంలో చిక్కుకున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రమాదంగా మారడంతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు తొలగించడం వల్ల మూడు రోజులుగా అంధకారంగా తయారైందని, 60 కుటుంబాలను ఖాళీ చేయించడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బిల్డర్‌ను వెంటనే అరెస్టు చేయాలని, అతని అక్రమాలను అడ్డుకోకుండా వదిలేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెట్‌బ్యాక్‌లకు స్థలం వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ తవ్వుతున్నారని ఏడాదిన్నర కాలంగా ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకొని అధికారులపై విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని కార్పొరేటర్ నవతారెడ్డి డిమాండ్ చేశారు. ఇంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడడానికి కారణమైన బిల్డర్‌ను అరెస్టు చేయాలని, అపార్టుమెంటువాసులకు బిల్డర్ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని ఉన్నతాధికారులను కార్పొరేటర్ డిమాండ్ చేశారు.

తెరాసకు రోజులు దగ్గర పడ్డాయ్!
* టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎద్దేవా
కెపిహెచ్‌బికాలనీ: టిడిపి జెండా దిమ్మెలను కూల్చివేసిన టిఆర్‌ఎస్‌ను గద్దె దించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. కెపీహెచ్‌బి టెంపుల్ బస్టాప్‌లో శనివారం రాత్రి కొందరు వ్యక్తులు టిడిపి జెండా దిమ్మెను కూల్చివేయడంతో అదే ప్రాంతంలో తిరిగి నిర్మించిన పార్టీ జెండాను సోమవారం ఆయన అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ డేరా బాబాలా కనుమరుగయ్యారని, ఇక తెలంగాణలో కెసిఆర్‌ను డేరా బాబాగా సాగనంపాల్సింది ఉందన్నారు. కూకట్‌పల్లి సందుల్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా ఉన్న కృష్ణారావు... టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి... అభివృద్ధి కోసం టిఆర్‌ఎస్‌లో చేరానని చెప్పి ఏమేరకు అభివృద్ధి చేసారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిపించిన టిడిపి దిమ్మెను కూల్చివేయడమే అభివృద్ధా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి దిమ్మెలను కూల్చివేస్తున్న విషయంలో టిడిపి కార్యకర్తలకు అదేశిస్తే టిఆర్‌ఎస్ భవన్‌ను నేలమట్టం చేస్తారన్నారు. టిడిపికి తెలంగాణ ప్రజలకు త్వరలో మంచి రోజులు రానున్నాయన్నారు. మియాపూర్‌లో వందల ఎకరాల్లో భూములను కొల్లగొట్టారే తప్ప పేదలకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో బీజం పడిన మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. సీఎం కెసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి అమలు కాలేదన్నారు. ప్రజల మనస్సులో నేటికి టిడిపిపై మక్కువ పోలేదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టిడిపి విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి, సుభాష్‌యాదవ్, కెపీహెచ్‌బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, నాయకులు జాస్తీ శ్రీ్ధర్, నాని, నారాయణరాజు, కట్టా నర్సింగ్‌రావు, భద్రమ్, సత్యం, పద్మ చౌదరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అందరూ అర్థం చేసుకునేలా ఆకాశవాణి కార్యక్రమాలు
హైదరాబాద్: ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసార మవుతున్న కార్యక్రమాల్లో ప్రధానంగా ఆకాశవాణి ద్వారా ప్రసారయ్యే కార్యక్రమాలను నిరక్ష్యరాస్యులు కూడా అర్థం చేసుకోగలరని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి అధ్యక్షుడు ఆచార్య ఎన్.గోపీ అన్నారు. ప్రస్తుత కాలంలో ప్రసార మాధ్యమాల పోటీ పెరిగి కొత్త కొత్త మార్పులతో టీవీ చానళ్లు, ప్రైవేటు ప్రసార కేంద్రాలు రావడంతో యాంకర్ల సంస్కృతి పెరిగిపోయి స్వచ్ఛమైన తెలుగు భాష లోపిస్తోందని ఆచార్య గోపీ విచారం వ్యక్తం చేసారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సోమవారం ఉదయం రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగిన ‘తెలుగు భాషా సాహిత్య సేవలో ఆకాశవాణి’ అనే అంశంపై రెండురోజుల సదస్సును ఆచార్య ఎన్.గోపి ప్రారంభించారు. ‘రక్తప్రసారం’ అనే కవితను చదివారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి ఎస్.పి.మహాలింగేశ్వర్ ప్రారంభోపన్యాసం చేయగా ఆకాశవాణి సహాయ సంచాలకులు వి.ఉదయ్‌శంకర్ వక్తలను పరిచయం చేసారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. మూడు భాగాలుగా జరిగిన సదస్సులో ఆకాశవాణి విశ్రాంత డిప్యుటీ డైరక్టర్ ఆర్.పద్మనాభరావు ‘రేడియో నాడు నేడు’ అనే అంశంపైన, పిఎస్ గోపాలకృష్ణ ‘శ్రవణభాష వైశిష్ట్యం అనే అంశంపైన ఎస్‌బి శ్రీరామమూర్తి ‘రేడియో కార్యక్రమాల రూపకల్పనలో వాడుక భాష’ అనే అంశంపైన సినీనటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు రేడియో నాటకం అనే అంశంపైన, వోలేటి పార్వతీశం ‘రేడియో కవిత్వం’పైన, నాగసూరి వేణుగోపాల్ ‘రేడియో కథ‘ అనే అంశంపైన ప్రసంగించి పత్రాలు సమర్పించారు. సాయంత్రం జరిగిన కవిసంధ్య-ఆశారాజు కవిసమ్మేళనం జరిగింది.