జాతీయ వార్తలు

99శాతం వెనక్కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గత ఏడాది నవంబర్‌లో రద్దయిన 1000, 500 నోట్లలో 99 శాతం వెనక్కి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ బుధవారం వెల్లడించింది. 15.28 లక్షల కోట్ల విలువైన 15.44 లక్షల కోట్ల కరెన్సీ నోట్లు తిరిగి వచ్చేసినట్టు బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. అంటే 99శాతం రద్దయిన నోట్లు తిరిగి వ్యవస్ధలోకి వచ్చేసినట్టేనని వివరించింది. కేవలం 1.4 శాతం నోట్లు వినా రద్దయిన 1000 నోట్ల అన్నీ వెనక్కి వచ్చేసినట్టేనని స్పష్టం చేసింది. రద్దయిన పాత నోట్ల స్థానే కొత్త నోట్ల ముద్రణకు 8వేల కోట్ల రూపాయలు ఖర్చయిందని కూడా తన నివేదికలో ఆర్‌బిఐ వెల్లడించింది. గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 31 వరకూ 5,540 బిలియన్ రూపాయల విలువైన 23.8బిలియన్ కరెన్సీ నోట్లను మార్కెట్‌లోకి విడుదల చేశామని తెలిపింది. కొత్తగా మార్కెట్‌లోకి బ్యాంకు నోట్లలో 2వేల రూపాయలు మార్చి నాటికి 50.2శాతం ఉందని 10రూపాయలు, 100 రూపాయల నోట్లు 62.0శాతం ఉన్నాయని తెలిపింది.