జాతీయ వార్తలు

జిఎస్టీ దిగ్విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో విప్లవాత్మక రీతిలో చేపట్టిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విధానం దిగ్విజయంగా అమలవుతోందని, దీనిపై మొదట్లో తలెత్తిన సందేహాలు, అపోహలు, భయాలు పటాపంచలయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత రెండు నెలలుగా పరోక్ష పన్నుల వ్యవస్థ అద్భుతంగా అమలు అవుతోందని, పాత వ్యవస్థ స్ధానంలో ఈ మార్పు అత్యంత సజావుగా ఇమిడిపోయిందన్నారు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని, వచ్చే నెల వ్యవధిలోనే దీన్ని సాధించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సిఎస్‌లను మోదీ కోరారు. ‘సానుకూల పాలన -సకాలంలో అమలు’ అన్న అంశంపై బుధవారం జరిగిన 21వ ‘ప్రగతి సదస్సు’లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. దేశంలో భిన్నరకాల పన్నులస్థానే ఏక పన్ను వ్యవస్థను జూలై 1నుంచి కేంద్రం అమలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 56 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టిన తొమ్మిది వౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల అమలును నేటి సమావేశంలో మోదీ సమీక్షించారు. రైల్వేలు, రహదారులు, ఇంధనం, ఆరోగ్య, చమురు పైప్‌లైన్ సహా అనేక రంగాల్లో ఈ ప్రాజెక్టులను కేంద్రం చేపట్టింది. ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులు అమలవుతున్నాయి. పేటెంట్లు, ట్రేడ్ మార్కులకు సంబంధించిన అంశాల పరిష్కారంపైనా మోదీ ఈ సందర్భంగా దృష్టి పెట్టారు. ఈ దిశగా సంతృప్తికరంగా పనిచేస్తున్నారంటూ అధికారులను అభినందించిన మోదీ, మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించే దిశగా కృషి చేయాలని ఉద్బోధించారు. అధికారులు కూడా ఇప్పటి వరకూ తాము చేపట్టిన చర్యల గురించి, సాధించిన ఫలితాల గురించి ప్రధానికి వివరించారు. అయితే ఈ విషయంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని అంతర్జాతీయ ప్రమాణాలను సాధించాలని వారిని మోదీ కోరారు. స్మార్ట్ సిటీ మిషన్ పనితీరును ప్రశంసించిన మోదీ అనేక పట్టణాలు ఇందులో పాల్గొనడాన్ని ప్రశంసించారు. ఇప్పటి వరకూ గుర్తించిన 90 నగరాలను అనుకున్న ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమన్నది ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలేనన్నారు. గిరిజనుల హక్కులను గుర్తించి వాటిని వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మోదీ కోరారు. కేంద్రం చేపట్టిన ఈ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ వల్ల పారదర్శకత పెరిగిందని, వృధా వ్యయమూ తగ్గిందని తెలిపారు. ప్రభుత్వ సమీకరణలకు సంబంధించి ఈ విధానానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అన్ని రాష్ట్రాల అధికారులను మోదీ కోరినట్టు పిఎమ్‌ఓ ఓ ప్రకటనలో తెలిపింది.