జాతీయ వార్తలు

అవినీతిపై సివిసి ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజిలు, గ్రామసభల్లో అవినీతికి వ్యతిరేకంగా చైతన్యం తీసుకు వచ్చే బాధ్యతను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బీమా కంపెనీలకు అప్పగించింది. ఇందుకోసం ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థ, బ్యాంక్, బీమా కంపెనీలకు కొన్ని నగరాలను కేటాయిస్తూ సివిసి ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, కళాశాల విద్యార్థుల్లో అవినీతి దుష్ప్రభావంపై అవగాఉన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ప్రతి క్షేత్రస్థాయి విభాగం, లేదా శాఖ కనీసం రెండు పాఠశాలలు, మూడు కళాశాల విద్యార్థులను చైతన్యం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషన్ కోరుకొంటోందని సివిసి ఆ ఉత్తర్వులో పేర్కొంది. ఇందుకోసం మొత్తం 163 నగరాలు, 96 సంస్థలను ఎంపిక చేయడం జరిగిందని ఆ ఉత్తర్వు పేర్కొంది. నైతిక విలువలు చిన్నారుల మెదళ్లలో శాశ్వతంగా నాటుకోవడానికి వీలుగా పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే కార్యకలాపాలు కొంతకాలం పాటు నిరంతరంగా కొనసాగాలని కూడా సివిసి ఆ ఉత్తర్వులో పేర్కొంది. అన్ని సంస్థలు కూడా స్కూళ్లు, కాలేజిల్లో ‘ఇంటిగ్రిటీ క్లబ్’లను ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించాలని కూడా స్పష్టం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గ్రామసభలు అవినీతిపై సెమినార్లు, వర్క్‌షాపులను ఏర్పాటు చేసి జనం వాటిలో విరివిగా పాల్గొనేలా చూడాలని తెలిపింది. అలాగే బ్లాక్‌స్థాయి, జిల్లా ప్రధాన కేంద్రం స్థాయిలలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇలాంటి సెమినార్లను ఏర్పాటు చేయాలని సూచించింది. జనంలో చైతన్యం తీసుకురావడానికి సామాజిక మాధ్యమం, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, ఇ-మెయిల్స్, వాట్సాప్‌లు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలను కూడా విస్తృతంగా వాడుకోవాలని కూడా సివిసి సూచించింది.
ఈ కార్యక్రమం కోసం దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బిఐకి న్యూఢిల్లీ సహా 50 నగరాల బాధ్యతను అప్పగించగా, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 19 నగరాల బాధ్యతను అప్పగించారు. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు గౌహతి, కోల్‌కతా, రాజ్‌కోట్, వడోదరా, చెన్నై, పారాదీప్ సహా 14 నగరాలను కేటాయించగా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు విశాఖపట్నం,బృహన్ముంబయి, అల్వార్ తదితర నగరాల్లో కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను అప్పగించారు.