జాతీయ వార్తలు

డిఆర్‌ఎంలకు మరిన్ని అధికారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అవసరమైనప్పుడు ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా డివిజన్ రైల్వే మేనేజర్లకు (డిఆర్‌ఎం) మరిన్ని అధికారాలు ఇవ్వాలని రైల్వే సురేశ్ ప్రభు ఏర్పాటు చేసిన ఒక కమిటీ తన ముసాయిదా నివేదికలో సిఫార్సు చేసింది. ఆగస్టు నెలలో వరసగా సంభవించిన రైలు ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఈ సిఫార్సు చేసింది. డిఆర్‌ఎంలు రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు గనుక వారికి మరిన్ని ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను ఇవ్వడానికి ఉద్దేశించిన ప్రక్రియను ఖరారు చేయడం కోసం ఈ కమిటీని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గత జూన్‌లో ఏర్పాటు చేశారు. కమిటీ వచ్చేనెల తన తుది నివేదికను మంత్రికి సమర్పించవచ్చని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుతం డివిజన్ స్థాయిలో రైల్వేలకు అధిపతులుగా ఉండే డిఆర్‌ఎంలు ప్రధానంగా రైళ్లు నడపడం, కస్టమర్లతో సంబంధాలు, రైల్వే ఆస్తుల పరిరక్షణలాంటి వ్యవహారాలను చూస్తుంటారు. అయితే రైలు మార్గాల్లో మరమ్మతులు పూర్తయ్యేవరకు మూడు గంటల పాటు రైళ్లను ఆపేయడం, లేదా దారి మళ్లించేందుకు డిఆర్‌ఎంలకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఈ కమిటీ తన ముసాయిదా నివేదికలో సిఫార్సు చేసింది. ఇతర డివిజన్లలో రైళ్ల రాకపోకలపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడడం కోసం మూడుగంటల కాలపరిమితిని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 19న ఉత్తరప్రదేశ్‌లోని ఖతౌలి వద్ద ఈ నెల 19న కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి 26మంది మృతిచెందిన కొద్ది రోజులకే రైల్వేలో సిబ్బంది వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ సూచన చేయడం గమనార్హం. ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తర్వాత మరో రెండు ప్రమాదాలు కూడా జరగడం తెలిసిందే. ఈ నెల 23న యుపిలోని అరాయియా జిల్లాలో కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పది బోగీలు పట్టాలు తప్పడంతో వతదమందికి పైగా గాయపడ్డారు. భద్రత, ప్రయాణికుల సంతృప్తి, రవాణా వ్యాపారం, కస్టమర్లతో సంబంధాలు, రాబడిని పెంచడం, ఆస్తుల పరిరక్షణలాంటి వాటిపై డిఆర్‌ఎంలు ఎక్కువగా దృష్టిపెట్టేలా చూడడంపై కమిటీ ఆలోచిస్తోందని రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. డివిజన్‌కు ఇచ్చిన ఖర్చు పరిమితికి లోబడి వివిధ పద్దుల కింద మంజూరయిన రెవిన్యూ గ్రాంటును సద్వినియోగం చేసుకునే స్వేచ్ఛ డిఆర్‌ఎంలకు ఉండాలని కమిటీ తన ముసాయిదా నివేదికలో సూచించిందని ఆ అధికారి చెప్పారు. సేఫ్టీకి సంబంధించిన సమస్యలను సత్వరం పరిష్కరించడానికి వీలుగా అత్యవసర కొనుగోళ్లు జరపడానికి కూడా డిఆర్‌ఎంకు అధికారాలు ఉండాలని కమిటీ సూచించింది.