జాతీయ వార్తలు

డిసెంబర్ వరకు ఆధార్ గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీం కోర్టు నవంబర్‌లో విచారణ జరుపుతుంది. సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఆధార్‌ను సమర్పించే గడువును డిసెంబర్ 31 దాకా పొడిగించనున్నట్లు కేంద్రం న్యాయస్థానానికి తెలియజేసింది. సెప్టెబర్ 30తో ముగియనున్న డెడ్‌లైన్‌ను డిసెంబర్ 31 దాకా కేంద్రం పొడగించనున్నట్లు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ తెలియజేసిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్లను సత్వరం విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ బెంచ్‌లో న్యాయమూర్తులు అమితావ రాయ్, ఎఎం ఖన్వలికర్ కూడా ఉన్నారు. పలువురు పిటిషనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ బుధవారం బెంచ్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ పిటిషన్లను సత్వరం విచారించాలని కోరారు. వివిధ సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం విధించిన గడవు సెప్టెంబర్ 30తో ముగియనున్న విషయాన్ని దివాన్ ప్రస్తావించగా ఈ గడువును డిసెంబర్ 31 దాకా పొడగించనున్నట్లు వేణుగోపాల్ చెప్పారు. అందువల్ల ఈ పిటిషన్లను సత్వరం విచారించాల్సిన అవసరం లేదని నవంబర్ మొదటివారంలో ఈ అంశం విచారణకు వస్తుందని బెంచ్ తెలిపింది.
పలు ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను కేంద్రం ఇటీవల తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆధార్‌ను తప్పనిసరి చేయడంవల్ల తమ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని పిటిషన్‌దారులు వాదించారు. దీంతో ఈ అంశంపై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే వ్యక్తిగత గోప్యత అంశం కూడా దీనితో ముడిపడి ఉండడంతో ఇది రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కా కాదా అనే అంశంపై సందిగ్ధత ఏర్పడింది. దీంతో ఈ అంశంపై విచారణ జరపడానికి తొమ్మిదిమంది న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన ఆ ధర్మాసనం వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కేనంటూ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ తీర్పును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఇప్పుడు ఆధార్‌పై విచారణ జరపాలని నిర్ణయించింది.