సాహితి

హక్కుల కిరణ ప్రసారం (కవితలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మట్టి బండి నుండి ప్లాస్టిక్ శకటందాకా
సుదీర్ఘ యాన పరిణామంలో వేరు వేరు

రూపాలు
మనుషుల ముఖాలొకటే జీవనమూర్తులు

వేరు
దారులు వేరు గమ్యాలు వేరు తిరిగే చక్రంపై

తిరుగుతూ
మానవ హక్కుల పోరాటం, ఆధునికం
ఎప్పటికీ వేగంలో వుంటుంది సమస్యలతో
ప్రభావ ఫలితంగా సాధించినవి ఎన్ని ఉన్నా
తృప్తినిచ్చే జవాబు సార్థకతను

నిలుపుతుంది
ఎంతకాలం గడచినా ఇంకా ఏవో
అందని కలల వలె మిగిలిపోయి
ఇంకా మానవ శక్తి సమీకరణం
జరగాలనిపిస్తుంది! ఇది దాగని నిజం

ఏ దారి ఎందాక ఎక్కడికి వెళ్లేదీ తెలియాలి
దారులన్నిటిపై చూపు! సంక్లిష్ట మనో

వ్యవహారం
తత్కాలంలో స్వార్థం ఎగిరే రెక్కలు

విప్పుతుంది
మట్టిని మరపించే పయనం సాగుతుంది

మింటిలో
జీవితాన వ్యవహారం వ్యాపారం రెండూ
కావడి కుండల్లా చెరొక వైపు భుజాలపై
తూగే బరువులతో తలపై తన మూటతో
తనలో తల ఎత్తే ఊహల జాబితాతో

చీకటిలోను కాలం మనిషికి వశమై
వెలుగు దారి గీత గీచి చూపిస్తుంది
ఇప్పటిదాకా కనిపించని వస్తువులు
మానవ హక్కుల కిరణ ప్రసారంతో

అందేను
అశక్యం కాదు అద్భుతం కాదు ఏదీ
మంచు తెరలు తొలగితేనే రవి కనిపించేదీ
- మాదిరాజు రంగారావు

అమ్మ తుమ్మ
అది
అమ్మ ఒడి
అలసిన శ్రమకు సేద

అన్ని జీవాలకు
తన నీడని
ప్రాణవాయువు చేసే మడి

మండే సూర్యుణ్ణి
నిలబెట్టి ప్రశ్నించి
ఓడిస్తుంది తన చిరుటాకుల డాలుతో

అది
తలపై రుమాలు
ఒంటి మీది గొంగడి

దాని నీడ
మెత్తని దూది పరుపు
ఆదమరిచి నిద్రించే పట్టెమంచం

నల్లని కాండం
కొమ్మల పొదలు
పేదవాని చల్లని కుటీరం

తుమ్మ చెట్టు నీడ
దాని ముందు ఎందుకూ పనికిరాదు
గోడల మధ్య చిక్కిన ఏసి మేడ!
- ఎనుపోతుల వెంకటేశ్
9573318401

నేను
నేను
ఆకాశాన్నుంచి
రాలిన
స్వాతి చినుకునీ కాను..!

నేను
సముద్రపు చిప్పలో
దొరికిన
మంచి ముత్యాన్నీ కాను..!

నేను
గనులనుంచి
తవ్విన
వజ్రాన్నీ కాను..!

నేను
నిధుల భాండాగారాల్లో
కనిపించే
బంగారాన్నీ కాను..!

నేను
వాటన్నింటినీ తలదన్ని
అమ్మ కడుపునుండి
పుట్టిన ప్రేగుబంధాన్ని..!!
- శానాపతి (ఏడిద) ప్రసన్నలక్ష్మి

హే! డ్రాగన్...!

లక్ష్యశుద్ధి లేకుండా
నీవెన్నడుగులు వేసినా
గమ్యం కడు దూరమే!

సముద్రాన్ని దాటించిన
మా వానరులకు ఏ టెక్నాలజీ తెలుసు?
రామాజ్ఞపైనే గురి!

రావణుడెంత బలశాలైనా
ధర్మం ఎక్కుపెట్టిన లక్ష్యం ముందు
పది తలలూ నేలరాల్చాల్సిందే!

పరాజయంతో పాఠం నేర్వకపోతే
ఫలితం అనుభవించాల్సిందే!

ధర్మవిహితుని విజయాలు తాత్కాలికమే
హద్దులు దాటినప్పుడల్లా
కాలమే మరణ శాసనం లిఖిస్తుంది!

హే డ్రాగన్! నీవు హద్దులు మీరొద్దు
యుద్ధమెప్పుడూ అనాగరిక ప్రయోగమే
దాన్ని అనివార్యం చేయొద్దు!!
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి