జాతీయ వార్తలు

ఒబిసి క్రీమీలేయర్ పరిమితి రూ.8లక్షలకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఒబిసి రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీలేయర్ పరిమితిని ఇప్పుడున్న ఏడాదికి ఆరు లక్షల రూపాయల పరిమితిని 8 లక్షలకు పెంచడం జరిగిందని బుధవారం జారీ చేసిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అంటే వరసగా మూడు సంవత్సరాల పాటు 8 లక్షల రూపాయలు అంతకు పైబడిన వార్షికాదాయం కలిగిన వారి పిల్లలు క్రీమీలేయర్ పరిధిలోకి వస్తారు. ఒబిసిలకు లభించే రిజర్వేషన్ ప్రయోజనాలేవీ పొందడానికి వారు అర్హులు కారు. ‘ఇతర వెనుకబడిన వర్గాలలో (ఒబిసి) క్రీమీలేయర్‌ను నిర్ణయించడానికి వార్షికాదాయ పరిమితిని రూ.6 లక్షలనుంచి రూ.8 లక్షలకు పెంచాలని నిర్ణయించడమైంది’ అని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణా విభాగం (డిఓపిటి) జారీ చేసిన ఆ ఉత్తర్వు పేర్కొంది. 1993లో ఈ పరిమితిని లక్ష రూపాయలుగా నిర్ణయించారు. ఆ తర్వాత 2004లో రూ.2.5 లక్షలకు, 2008లో రూ.4.5 లక్షలకు, 2013లో రూ. 6 లక్షలకు పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పరిమితిని పెంచాలని తీసుకున్న నిర్ణయం గురించి కేంద్రమంత్రివర్గానికి తెలియజేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత నెల 23న ప్రకటించడం తెలిసిందే.
క్రీమీలేయర్ నిర్ణయించడానికి పరిమితిని పెంచడం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అసోంలో సూచనప్రాయంగా చెప్పిన విషయాన్ని కూడా జైట్లీ గుర్తుచేశారు. ఏడాదికి రూ.8 లక్షలు, అంతకన్నా ఎక్కువ సంపాదించే ఒబిసి కుటుంబాలను క్రీమీలేయర్ కేటగిరీ పరిధిలోకి తేవాలని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కూడా ప్రతిపాదించింది.