జాతీయ వార్తలు

రాజ్యాంగ నిపుణుడు పిపి రావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: రాజ్యాంగ నిపుణుడు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది పద్మభూషణ్ పిపి రావు (84) కన్ను మూశారు. గుండెనొప్పితో ఇండియన్ హార్ట్ సంస్థలో చికిత్స పొందుతూ రావు మరణించారు. రావు అసలు పేరు పావని పరమేశ్వరరావు. ఆయన ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగలిచర్లలో 1933 జూలై ఒకటో తేదీన జన్మించారు. నెల్లూరు జిల్లాలోని విఆర్ కాలేజ్‌లో బిఎ పూర్తి చేసిన పిపి రావు, ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బి, ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపాకునిగా పనిచేసిన అనంతరం ఆయన న్యాయవాద వృత్తిలో కొనసాగారు. సుప్రీం కోర్టు వెలువరించిన పలు కీలక తీర్పులలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. పిపి రావు దగ్గర పనిచేసిన చాలమంది న్యాయవాదులు సీనియర్లుగా, న్యాయమూర్తులుగా కూడా ఎంపికయ్యారు. ఇటీవలే న్యాయవృత్తిలో రావు యాభైయేళ్లు పూర్తిచేసుకున్నారు. ఆయన దేశానికి చేసిన సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం 2006లో పద్మభూషన్ పురస్కారంతో సత్కరించింది.
చంద్రబాబు సంతాపం
విజయవాడ: పావని పరమేశ్వరరావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పి.పి. రావు మృతి పట్ల స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆయనతో తనకున్న సుదీర్ఘ స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మారుమూల గ్రామం నుండి సుప్రీంకోర్టు స్థాయివరకు ఎదిగిన ప్రతిభాశాలి అని స్పీకర్ నివాళులర్పించారు.