తూర్పుగోదావరి

జ్ఞానభూమి అమలులో జిల్లాకు రెండో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబరు 21: జ్ఞానభూమి పోర్టల్ ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లింపులో జిల్లాకు రాష్ట్రంలో రెండవ స్థానం లభించింది. అలాగే జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపికలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రశంసలు లభించాయి. విజయవాడలో గురువారం ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో భాగంగా జిల్లాలో సాధించిన ప్రగతిపై సమీక్ష జరిగింది. వివిధ సమస్యలపైనా చర్చ సాగింది. కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్‌గున్నీ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి తదితరులు సదస్సులో పాల్గొన్నారు. సమీక్షలో సంక్షేమ పథకాల అమలుతీరుపై రాష్టస్థ్రాయి నివేదికను సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యమంత్రికి సమర్పించారు. తూర్పు గోదావరిలో వివిధ సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపిక ఆశాజనకంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. జ్ఞానభూమి ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాల చెల్లింపులో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం పొందింది. జ్ఞానభూమి అమలులో 36/34 స్కోరు సంపాదించి పశ్చిమ గోదావరి ప్రథమ స్థానంలో నిలవగా, 32/80 స్కోరుతో తూర్పు గోదావరి రెండో స్థానంలో ఉన్నట్టు పేర్కొన్నారు. సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన 216 జాతీయ రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ప్యాకేజీ 1,2 పనులను నిర్దేశించిన గడువు కంటే ముందుగానే పూర్తిచేస్తామన్న ధీమా ఉన్నట్టు చెప్పారు. అలాగే టాటా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్యాకేజీ-3 పనులు ఆశించిన వేగంతో జరగడం లేదని, ప్యాకేజీ 4 పనుల్లో ఎన్‌లైన్‌మెంట్ మార్పు విషయంలో ప్రతిష్ఠంభన నెలకొందని చెప్పారు. పనులు నాణ్యత లేని అటువంటి కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాకినాడ నగరంలో ఇంటింటికి వంటగ్యాస్ పథకం గురించి కలెక్టర్ మాట్లాడుతూ భాగ్యనగర్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థ ప్రస్తుతం రోజుకు 20నుండి 30 వంట గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఇస్తోందని పేర్కొన్నారు. సుమారు 9 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. దీనిని 100 నుండి 200కు పెంచితే నగరంలో 2018 ఫిబ్రవరికి 20 శాతం కుటుంబాలకు ఇంటింటికి పైపులైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు తక్షణం చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీనిచ్చారు.

సర్వే సమస్యలు సత్వరం పరిష్కరించండి
* అధికారులకు జెసి మల్లికార్జున ఆదేశం
సామర్లకోట, సెప్టెంబర్ 21: గతం నుండి గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సర్వే సమస్యలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లికార్జున రెవిన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని జి మేడపాడు గ్రామంలో నిర్వహిస్తున్న రైతు సేవలో రెవిన్యూ కార్యక్రమాన్ని జెసి మల్లికార్జున, కాకినాడ ఆర్డీవో ఎల్ రఘుబాబులు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ గతం నుండి సర్వే సమస్యలు చాలా పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే ఆన్‌లైన్ నమోదు, అడంగల్ సర్దుబాట్లు వేగవంతంగా పరిశీలించి సత్వరమే పరిష్కారం ఇవ్వాలని ఆదేశించారు. అలాగే రైతులు ప్రస్తుతం వాడుతున్న పాత పట్టదారు పాసు పుస్తకాల స్థానే రూ.130లు చెల్లించి కేవలం 30 రోజుల్లో మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త పాసు పుస్తకాలు పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాసు పుస్తకాలు నలిగిపోయి చిరిగిపోయిన దృష్ట్యా రైతులు కొత్త పాసు పుస్తకాల కోసం మీ సేవల్లో దరఖాస్తులు చేయాలని జెసి సూచించారు. సభలు జరుగుతున్న తీరును జెసి పరిశీలించి పలు సూచనలు చేశారు. జి మేడపాడు, వికె రాయపురం, ఉండూరు, వల్లూరు, మామిళ్లదొడ్డి, మాధవపట్నం గ్రామాల్లో తహసీల్దార్ ఎల్ శివకుమార్, డిప్యూటీ తహసీల్దార్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో 55 అర్జీలు వచ్చినట్టు వివరించారు. కార్యక్రమంలో మాధవపట్నం సర్పంచ్ బేదంపూడి సూర్యకుమారి, ఎఎంసి ఛైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు చౌదరి (శ్రీనుబాబు), సొసైటీ అధ్యక్షుడు పాలకుర్తి రవిబాబు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, విఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.
రూ. 42.7లక్షల గంజాయి స్వాధీనం
*ఎనిమిది మంది అరెస్టు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: విశాఖ ఏజెన్సీ నుంచి మహారాష్టల్రోని షోలాపూర్‌కు అక్రమంగా రవాణా అవుతున్న రూ. 42లక్షల 70వేలకు పైగా విలువైన 427 కేజీల గంజాయిని బొమ్మూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా 8 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తూర్పు మండలం డిఎస్పీ కె రమేష్‌బాబు తెలియజేశారు. గురువారం బొమ్మూరు పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్పీ బి రాజకుమారికి వచ్చిన ముందస్తు సమాచారం మేరకు బొమ్మూరు సిఐ కె నాగమోహన్‌రెడ్డి, ఎస్‌ఐ జె భానుప్రసాద్, ఎజిఎస్ ఎస్‌ఐలు కె శివాజీ, డి రాంబాబు వారి సిబ్బందితో గామన్ వంతెన జిరో పాయింట్ వద్ద నిఘా వేశారన్నారు. తొలుత షిఫ్ట్ డిజైర్ కారు పైలెట్‌గా వచ్చిందని, దాని వెనుక టాటా క్సినాన్‌యోధ వ్యాన్ వచ్చిందని, వాటిని తనిఖీ చేయగా 427కేజీల గంజాయి 10 బస్తాల్లో లభ్యమైందన్నారు. కారులోను, వ్యాన్‌లోను ఉన్న హైదరాబాద్ బంజార్‌హిల్స్‌కు చెందిన మాచర్ల లింగయ్య, అంగడి ఉపేందర్, నిజామాబాద్ జిల్లా వర్నికి చెందిన జె శంకర్, సికింద్రాబాద్‌కు చెందిన తుమ్మల దయానందరెడ్డి, స్థానిక ఆర్యాపురంనకు చెందిన విత్తనాల రమణ, విశాఖపట్నం జిల్లా రోలుగుంటకు చెందిన దన్నిన కృష్ణంరాజు, నర్సీపట్నంనకు చెందిన పెదిరెడ్ల రాంబాబు, జిల్లాలోని రౌతులపూడికి చెందిన వ్యాన్‌డ్రైవర్ కోరుప్రోలు రమణమూర్తిలను అరెస్టు చేసి, వారి నుంచి గంజాయిని, కారు, వ్యాన్లను, 2వేల నగదును, 5సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ చెప్పారు. షోలాపూర్‌కు చెందిన ప్రధాన సూత్రధారి సచిన్, సుభాష్, పెదిరెడ్ల శ్రీనివాస్‌లను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. గంగయ్య గత పదేళ్లుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడని, అతనిపై 4కేసులు నమోదయ్యాయన్నారు.
సమస్యలు తెలుసుకోవడానికే ఇంటింటికి టిడిపి
*కాకినాడ ఎంపి తోట
కరప, సెప్టెంబర్ 21: మూడున్నరేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతోపాటు వారి సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కాకినాడ ఎంపి, టిడిపి లోక్‌సభ పక్ష నేత తోట నరసింహం అన్నారు. గురువారం ఆయన కరప మండలం జెడ్ భావారం గ్రామంలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన స్థానిక ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో కలసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి పేదవాడకి సొంతగూడు ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా పెద్దఎత్తున నిధులు అందజేస్తున్నామని తెలిపారు. అలాగే అర్హులైన అందరికీ పెన్షన్లు, ప్రతి గ్రామంలో నూరుశాతం సిసి రోడ్లు, డ్రైయిన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో లోటుపాట్లు తెలుసుకోవడంతోపాటు పాటు సమస్యలను పరిష్కరించేందుకు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు, ఎంపిపి గుల్లిపల్లి శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి బుంగా సింహాద్రి, గోదావరి డిస్ట్రిబ్యూటరీ కమిటీ డైరెక్టర్ కోటగిరి మహేంద్ర, పార్టీ నాయకులు చుండ్రు వెంకన్నరావుచౌదరి, గండి వెంకటేశ్వరరావు, నాగం బాబులు, రెడ్డిపల్లి రాంబాబు, బొండా చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.