జాతీయ వార్తలు

సుప్రీం, హైకోర్టుల్లో తగ్గుముఖం పట్టిన పెండింగ్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: సుప్రీం కోర్టుతోసహా దేశవ్యాప్తంగా ఉన్న 24 హైకోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతోందని కేంద్ర న్యాయ శాఖ ఒక జబితాను విడుదల చేసింది. అయితే దిగువ కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్యలోఎటువంటి మార్పు లేదని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో న్యాయాధికారులు, న్యాయమూర్తుల ఖాళీలు భర్తీకాకపోవడం, పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో గత మూడేళ్ల కాలంలో సుప్రీం, హైకోర్టుల్లో పెండింగ్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు ఒక అధ్యయనాన్ని కేంద్రం వెల్లడించింది. సుప్రీం కోర్టులో 2014 చివరి నాటికి 62,794 కేసులు పెండింగ్‌లో ఉండగా, అది 2015 చివరినాటికి 59,272కు తగ్గినట్టు వెల్లడించింది. 2016 డిసెంబరు చివరినాటికి 62,537కు కేసులు పెరిగినప్పటికీ, గతంతో పోలిస్తే దాని శాతం తక్కువేనని ఆ జాబితా పేర్కొంది. ఇక హైకోర్టుల్లో 2014 చివరి నాటికి 41.52 లక్షల పెండింగ్ కేసులుంటే, 2015 ఏడాది చివరికి ఈ సంఖ్య 38.70 లక్షలకు తగ్గినట్టు పేర్కొంది. అయితే 2016 చివరికి పెండింగ్ కేసుల సంఖ్య 40.15 లక్షలకు పెరిగినా, 2014 ఏడాదితో పోలిస్తే తక్కువేనని వెల్లడించింది. అదే సమయంలో దిగువ స్థాయి కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య పరిస్థితి అలాగే కొనసాగుతోందని ఆ జాబితా వెల్లడించింది.
2014లో రికార్డు స్థాయిలో 2.64 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 2015 చివరినాటికి 2.70 కోట్ల కేసులకు పెరిగినట్టు పేర్కొంది. 2016 చివరినాటికి ఆ కేసుల సంఖ్య 2.54 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. హైకోర్టులలో సెప్టెంబరు 1నాటికి 1,079 న్యాయమూర్తులు అవసరం ఉండగా, ప్రస్తుతం 666 న్యాయమూర్తులు మాత్రమే హైకోర్టులలో పని చేస్తున్నారు. అయితే 413 మంది న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ కావల్సి ఉంది. కింది కోర్టులలో 20,000 న్యాయాధికారుల అవసరం ఉండగా, ప్రస్తుతం 4937 న్యాయాధికారుల కొరత ఉన్నట్టు ఆ జాబితా వెల్లడించింది.