హైదరాబాద్

అలరించిన త్యాగరాజ కీర్తనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఫిబ్రవరి 15: సద్గురు శ్రీత్యాగరాజస్వామి 169వ ఆరాధనోత్సవాల సందర్భంగా ఆంధ్ర మహిళాసభా అధ్యాపకులచే ‘శ్రీత్యాగరాజ పంచరత్న కీర్తనలు’ కార్యక్రమం రాగరాగిణి ఆర్ట్స్ అసోసియోషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సికా కార్యదర్శి ఆర్.చక్రపాణి పాల్గొన్నారు.
త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ముందుగా శాస్ర్తియ సంగీత కళాకారులు రమాప్రభ, చంద్రభాను, జ్ఞానాంబాక్, శాంతి అలపించిన త్యాగరాజ పంచరత్న కీర్తనలు అందరిని అలరించాయి. భీమన్న సాహితీనిధి అధ్యక్షురాలు హైమవతి భీమన్న సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రపంచ రికార్డుల గ్రహీత డా.కళావేంకట దీక్షితులు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎంవి రమణకుమారి, ఎంవి సుబ్బలక్ష్మీ పాల్గొన్నారు.