ఉత్తరాయణం

కాలుష్యాన్ని నివారిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంధనం పొదుపు ద్వారా కాలుష్యాన్ని నివారించడం అందరి బాధ్యత. ఆర్థిక రంగంలో సరళీకరణ విధానాలు అమలు చేశాక ఇంధన వినియోగం బాగా పెరిగిపోయింది. డిమాండ్, సప్లయి మధ్య సమన్వయం కోసం ఎన్నో వ్యూహాలతో సరికొత్త విధానాలు అమలు చేయవలసి వచ్చింది. సహజంగా దొరికే ఇంధన వనరులు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయాల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపు ఆవశ్యకత అందరికీ తెలియాల్సిన అవసరం ఏర్పడింది. మనదేశంలో ఇంధన వినియోగం ఏటా పదిశాతం చొప్పున పెరుగుతోం ది. మన అవసరాలకు తగ్గట్లు ఇంధన ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం. దీంతో కోట్లాది రూపాయల వ్యయంతో పెట్రో ఉత్పత్తులను దిగుమతి చేసుకోవలసి వస్తోంది. ముడి చమురు కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తోంది. మున్ముందు ఇలా జరగకుండా ఉండాలన్నది లక్ష్యం. అందుకే ఇంధన పొదుపు తప్పనిసరి.

-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట