వరంగల్

నూతన సంవత్సర వేడుకల్లో అపశుత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం (నూగూరు), జనవరి 1: నూతన సంవత్సర వేడుకలలో భాగంగా వేర్వేరు గ్రామాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు యువకులు ద్విచక్రవాహనాలపై నుండి పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రినుండి సోమవారం సాయత్రం వరకు జరిగిన మూడు ప్రమాదాలలో నూగూరు వద్ద జరిగిన సంఘటనలో మచ్చ నర్సింహరావు, రాంప్రసాద్, సురేందర్ ద్విచక్ర వాహనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమార్ అనే యువకుడు ద్విచక్రవాహనం పైనుండి పడి తీవ్రంగా గాయపడటంతో వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. గొల్లగూడెంలో జరిగిన ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మద్యం సేవించి వాహనం నడపవద్దని పోలీసులు ఎంతగా హెచ్చరించినా మద్యం మత్తులో ద్విచక్రవాహనాలను వాయువేగంతో నడపటంతో ఈ ప్రమాదాలు జరిగాయి.
పార్టీకి డబ్బులివ్వలేదని..

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య
రాయపర్తి, జనవరి 1: పుట్టినరోజున తన స్నేహితురాళ్లకు పార్టీ ఇచ్చేందుకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఏకే తండాలో సోమవారం జరిగింది. మృతురాలి బందువులు, ఎస్సై శ్రీ్ధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఏకే తండాకు చెందిన గుగులోతు యాక్యా దంపతుల ఏకైక కూతురు శిరీష (12) వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో ఉంటూ ప్రాథమిక పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. ఈనెల మూడవతేదీన పుట్టినరోజు ఉన్నందున ఇంటికి వచ్చిన శిరీష తన పుట్టినరోజున స్నేహితులకు పార్టీ ఇవ్వాలని, అందుకు తనకు డబ్బు ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగింది. కానీ శిరీష తల్లిదండ్రులు అంగీకరించకపోవటంతో మనస్తాపానికి గురైన శిరీష ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగటంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు శిరీషను చికిత్సనిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు అమె మృతిచెందింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శిరీష ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి. మృతురాలి తండ్రి యాక్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీ్ధర్ తెలిపారు.
పనులు త్వరగా పూర్తిచేయాలి
* ఎమ్మెల్యే దయాకర్‌రావు
జనగామ, జనవరి 1: పాలకుర్తి నియోజక వర్గంలో పలు మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ధయాకర్‌రావు ఆదేశించారు. సోమవారం దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే బాధిత కుటుంబాలను పరామర్శించారు. సీతారాంపురం గ్రామంలో స్మశాన ప్రహారి గోడ నిర్మాణం పనులను పరిశీలించార. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన కోరారు. పనులు సక్రమంగా చేసే విధంగా చూసుకునే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిథులపై ఉందన్నారు అనంతరం గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. కడవెండి, కొడకండ్ల, రామారం గ్రామాలకు చెందిన కే. శ్రీనివాస్, రామనర్సమ్మ, మమతలకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను అందచేశారు.