జాతీయ వార్తలు

కాంగ్రెస్‌తో చేతులు కలిపిన టిడిపి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించే అంశంపై ఎన్‌డిఏ మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తో కలిసిపోయింది. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి కలిగించేందుకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు మీతో కలిసి పోరాడతామని రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌తో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు తెలుగుదేశం పార్టీ సందేశం పంపింది. అంతటితో ఆగకుండా రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు ఆనంద్ శర్మ బుధవారం రాజ్యసభలో ప్రతిపాదించిన ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీలో ప్రతిపక్షం తరపున సభ్యుల జాబితాలో చేరి సంచలనం సృష్టించింది. ఆనంద్ శర్మ బుధవారం ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఒక తీర్మానం ప్రతిపాదించారు. ఆయన ఈ తీర్మానంలో సెలెక్ట్ కమిటీలో ప్రతిపక్షం తరపున సభ్యులుగా ఉండేవారి పేర్లు కూడా సభాముఖంగా ప్రకటించారు. ఆ పేర్లలో తెలుగుదేశం సభ్యుడు సి.ఎం.రమేష్ పేరు కూడా ఉండటం గమనార్హం. సి.ఎం.రమేష్ మంగళవారం మధ్యాహ్నం రాజ్యసభ ఇన్నర్ లాబీలో గులాం నబీ ఆజాద్‌ను కలిసి ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని తమ పార్టీ కూడా డిమాండ్ చేస్తోందనీ, ఈ లక్ష్య సాధనకోసం ప్రతిపక్షంతో కలిసి పోరాడతామని చెప్పి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇద్దరు కేంద్ర మంత్రులతో భాగస్వామిగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ప్రతిపక్షంతో చేతులు కలపటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేయటం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య పెరుగుతున్న దూరానికి అద్దం పడుతోందని భావిస్తున్నారు.