జాతీయ వార్తలు

ఎప్పుడైనా ప్రశ్నించుకోండి.. లేదంటే అరెస్టు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో దేశద్రోహ కేసుకు సంబంధించి పోలీసులు అనే్వషిస్తున్న వారిలో ఆ వర్శిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు తమ కాంటాక్ట్ వివరాలను తెలియజేస్తూ పోలీసులకు లేఖ రాశారు. ఈ కేసులో పోలీసులు ఎప్పుడు అవసరమనుకుంటే తమను ప్రశ్నించుకోవచ్చని, లేదంటే అరెస్టు కూడా చేసుకోవచ్చని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. జెఎన్‌యు క్యాంపస్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఆ వర్శిటీ విద్యార్థి సంఘ (జెఎన్‌యుఎస్‌యు) అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను ఈ నెల 12వ తేదీన పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. దీంతో వర్శిటీ క్యాంపస్ నుంచి అదృశ్యమైన ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, అశుతోష్ కుమార్, అనంత్ ప్రకాష్ అనే విద్యార్థులతో పాటు జెఎన్‌యుఎస్‌యు ప్రధాన కార్యదర్శి రామా నాగ ఆదివారం రాత్రి మళ్లీ క్యాంపస్‌లో ప్రత్యక్షమయ్యారు. వీరిలో ఉమర్, అనిర్బన్ పోలీసులకు లొంగిపోవడంతో ఢిల్లీలోని ఒక కోర్టు బుధవారం వారిని మూడు రోజుల రిమాండ్‌కు తరలించగా, మిగిలిన ముగ్గురు తమ రూములు, హాస్టళ్ల నెంబర్లతో పాటు కాంటాక్ట్ నెంబర్లను వివరిస్తూ పోలీసులకు లేఖ రాశారు. ఈ కేసులో పోలీసులు ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు తమను ప్రశ్నించుకోవచ్చని, లేదంటే అరెస్టు కూడా చేసుకోవచ్చని వారు ఆ లేఖలో పేర్కొన్నట్లు ఎఐఎస్‌ఎ (ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్) జాతీయ అధ్యక్షుడు సుచేతా డే వెల్లడించారు.