శ్రీకాకుళం

శతశాతం పదోతరగతి ఉత్తీర్ణతపై కౌన్సిలింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 4: ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలను ఎదుర్కొనే విధంగా జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు పదోతరగతి ఫలితాలు సాధనపై ప్రత్యేక దృష్టి సారించారు. శతశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీవిద్యార్ధుల ఇళ్ళకు సెలవురోజైన ఆదివారం ఉపాధ్యాయులు చేరుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. చదువుపై ఆసక్తిపెంచేలా ప్రోత్సహించాలని అనారోగ్యపరిస్థితులు ఎదురుకాకుండా పౌష్టికాహారం అందివ్వాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ముద్దాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాడుగుల రామారావు నేతృత్వంలో ఉపాధ్యాయులు రుప్పపేట అంబేద్కర్ నగర్, సెగిడిపేట, రామజోగిపేట గ్రామాల్లో పదోతరగతి పరీక్షలకు హాజరుకాబోయే విద్యార్థినీవిద్యార్ధుల ఇళ్ళకు చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. మండలంలోని అన్నీ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు కూడా ఇదే ఫార్ములాను కొనసాగిస్తూ ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఖాదీ చేనేత వస్త్రాలను పరిశీలించిన
ఇండోనేషియా బృందం
పొందూరు, ఫిబ్రవరి 4: స్థానిక ఖాదీ చేనేత వస్త్రాల తయారీలో ఇండోనేషియాకు చెందిన బృందం ఆదివారం డాక్యూమెంటరీ చిత్రీకరించారు. ఖాదీ నేత ప్రక్రియ విధానాన్ని, నూలు వడికే విధానాన్ని మగ్గాన్ని పరిశీలించారు. పొందూరు ఖాదీపై 70 ఏళ్లుగా ఇటలీకు ఉన్న సంబంధాన్ని సంబరాలు కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని చూపించడం జరుగుతుందన్నారు. ఖాదీ కార్మికుల చేతివాటంతో బట్టలు తయారు చేయడం ఆద్భుతంగా ఉందని సంభరపడ్డారు. పల్చటి వస్త్రాన్ని తయారు చేసి అందించడం భారతీయ గౌరవాన్ని పెంపొందించిందని ఇటలీ ఇండోనేషియన్లు కితాబిచ్చారు. ఈ బృందంలో సాయిబాబు వీవర్స్ సొసైటీ అధ్యక్షులు గంపల వీరభద్రరావు, ఎ ఎస్‌కెకె ప్రతినిధులు ఉన్నారు.