హైదరాబాద్

5న కౌన్సిల్ తాగునీరు, శానిటేషన్‌పై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాజధానికి ఎన్నికైన మొట్టమొదటి మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ఈ నెల 5న మొట్టమొదటి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం పది గంటలకు మేయర్ అధ్యక్షతన ప్రారంభం కానున్న ఈ కౌన్సిల్ సమావేశంలో వేసవి కాలంలో తీవ్ర రూపం దాల్చనున్న తాగునీటి సమస్య, పారిశుద్ధ్య పనులు, ఘన వ్యర్థాల నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. అంతేగాక, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అధికార టిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎన్నికై రానున్న 99 మంది కార్పొరేటర్లు కౌన్సిల్ ముందు తమ డివిజన్ల సమస్యలుంచేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. కొందరు కార్పొరేటర్లు మంచినీటి సమస్యను ఎదుర్కొనేందుకు డివిజన్‌కు కనీసం అయిదారు బోర్లను మంజూరు చేయాలన్న ప్రతిపాదన కౌన్సిల్‌లో పెట్టనున్నారు. అక్రమ నిర్మాణాలు, పారిశుద్ధ్య పనుల్లో అవకతవకలు వంటి అంశాలపై కూడా అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు చర్చించనున్నారు. కానీ విపక్షాలకు బలమేమీ లేకపోవటంతో మేయర్, కార్పొరేటర్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఇతర అంశాలకు సంబంధించి తీర్మానాలను ఏకగ్రీవంగా జరిగే అవకాశముంది.