శ్రీకాకుళం

19న సామూహికంగా అంగన్వాడీ కేంద్రాలు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, మార్చి 16: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని దీనికి నిరసనగా ఈ నెల 19న. సామూహిక అంగన్వాడీ కేంద్రాల మూసివేత కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం.జయలక్ష్మీ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రాజెక్టు అధికారికి వినతి పత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఐ.సి.డి.ఎస్. కమీషనర్ కార్యాలయం, గుంటూరు వద్ద సామూహిక దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. 19న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అంగన్వాడీ కార్యక్రర్తలంతా హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఆక్రమణలపై అధికారులు కనె్నర్ర!!
నరసన్నపేట, మార్చి 16: మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ భూములను ఇటీవల ఆక్రమణలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తహశీల్థార్ జె.రామారావు తెలిపారు. ఇటీవల పట్టణంలో ప్రధాన రహదారికి ఆనుకుని సౌభాగ్యలక్ష్మీ కళ్యాణమండపం వద్ద అక్రమ నిర్మాణాలను గుర్తించారు. పంచాయతీ నుంచి నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ, నిర్మాణాలు కొనసాగించడంపై అడ్డుకున్న అధికారులపై దురుసుగా ప్రవర్తించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళనున్నట్టు చెప్పారు. ఆక్రమణ వివరణాలను కలెక్టర్‌కు అందజేసామని పగడ్బందీగా వ్యూహారచన చేసి అక్రమ కట్టడాల నిర్మాణాలను కూల్చివేయడం తప్పదని హెచ్చరించారు. పలు అక్రమ నిర్మాణాలు కూడా అనేక చోట్ల జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై ఉక్కుపాదమోపడం ఖాయమని స్పష్టం చేసారు.