శ్రీకాకుళం

సిక్కోల్.. అవుటర్ రింగ్‌రోడ్డు కార్యాచరణ ప్రారంభించాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 16: శ్రీకాకుళం నగరం అవుటర్ రింగ్‌రోడ్డు కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించాలని కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి అన్నారు. అవుటర్ రింగ్ రోడ్డుపై కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజా సౌకర్యార్థం, భవిష్యత్తు అవసరాల రీత్యా అవుటర్ రింగ్ రోడ్డు పరిధిని పెంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. రింగ్‌రోడ్డు నిర్మాణం కనీసం 50 సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. నవభారత్ జంక్షన్ నుంచి ఆమదాలవలస వరకూ ప్రస్తుతం ఉన్న ప్రణాళికలను కింతలి, కనిమెట్ట తదితర ప్రాంతాలను కలుపుతూ నిర్మచడం వల్ల భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు. పట్టణీకరణ పెరుగుతున్న దశలో అందుకు తగిన విధంగా ప్రణాళికలు ఉండాలని, అందుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని పేర్కొన్నారు. రింగురోడ్డు నుంచి పట్టణంలోకి వచ్చుటకు కనీసం 10 రేడియల్ రహదారులను ఏర్పాటు చేయుటకు అవసరమైన ప్రతిపానలు ఉండాలని అన్నారు. మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన అనంతరం నిధఉలకు అనుగుణంగా దశల వారీగా అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. రింగు రోడ్డు నిర్మాణం వల్ల శ్రీకాకుళం పట్టణం ముఖచిత్రం మారుంతుందని అన్నారు. ఈ సమావేశంలో జెసీ కె.వి.ఎన్.చక్రధరబాబు, ఆర్డీవో బలివాడ దయానిధి, సర్వే సహాయ సంచాలకులు డి.బి.డి.బి.కుమార్, నగరపాలక సంస్థ సహాయ ప్లానర్ కుమార్, తహశీల్థార్లు ఎం.మురళీకృష్ణ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యుని అర్చకులకు ఉగాది పురష్కరాలు!
శ్రీకాకుళం (రూరల్), మార్చి 16: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అర్చకులు ఇద్దరికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఉగాది పురష్కారాలు అందుకోనున్నారు. ఈ నెల 18వ తేదీన విజయవాడలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ఆదిత్యుని అర్చకులు దర్భముళ్ళ సాంబమూర్తి, దర్భముళ్ళ శ్రీనివాసశర్మలకు ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ పురష్కారాలు అందుకోనున్నారు. ఈ మేరకు శుక్రవారం వీరికి దేవాదాయశాఖ నుంచి సమాచారం అందింది.

28న హుండీ ఆదాయం లెక్కింపు
శ్రీ సూర్యనారాయణస్వామి వారి ఆలయం హుండీ ఆదాయం లెక్కింపు ఈ నెల 28వ తేదీన ఉదయం నిర్వహించనున్నట్టు ఆయల ఈవో వి.శ్యామలదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు అర్చకులు, భక్తులు, గ్రామస్థుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా సాధనకై రాజీలేని పోరాటం
వజ్రపుకొత్తూరు, మార్చి 16:ప్రత్యేక హోదా రాష్ట్రానికి సాధించడానికి టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు వంక నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల టీడీపీ ఆధ్వర్యంలో హోదా సాధన కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. వజ్రపుకొత్తూరు, బాతుపురం, అక్కుపల్లి కూడళ్లులో ఎన్‌టిఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి మోసం చేసిందన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ప్రధాని మోదీ విధానాలను ఎండగట్టాలని కోరారు. రాష్ట్రంలో బిజెపికి రాజకీయభిక్ష పెట్టింది టీడీపీ అని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే భవిష్యత్తులో తగిన విధంగా ప్రజలు బుద్ది చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జి.వసంతస్వామి, మండల పార్టీ అధ్యక్షుడు గోవిందుపాపారావు, జడ్‌పిటిసి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్, డి.మోహనరావు, కె.రమణ, అమర నీలకంఠం, లక్ష్మినారాయణ, కృష్ణారావు, ఎస్.్భస్కరరావు, దుర్యోదనరెడ్డి, గోపాలరావు, అప్పోజీ తదితరులు పాల్గొన్నారు.