జాతీయ వార్తలు

తొమ్మిదో సీటూ బీజేపీదే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23:ఉత్తర ప్రదేశ్ సహా ఏడు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ మరింత బలపడింది. చివరి క్షణం వరకూ ఉత్కంఠ రేకెత్తించిన ఉత్తర ప్రదేశ్‌లోని పది స్థానాల్లో తొమ్మిది సీట్లను కైవసం చేసుకుంది. లోక్‌సభ ఉప ఎన్నికల నష్టాన్ని భర్తీ చేసుకుంటూ రాజ్యసభ ఎన్నికల్లో తన సత్తా చూపించింది. బీజేపీ బలం ప్రకారం 8 స్థానాలను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉన్నా..తొమ్మిదో స్థానాన్నీ నాటకీయ ఫక్కీలో గెలుచుకుంది. కర్నాటకలోని 4 సీట్లకు జరిగిన ఎన్నికల్లో కూడా చివరి వరకూ సస్పెన్స్ నెలకొంది. జేడిఎస్ బాయ్‌కాట్ నేపథ్యంలో తలెత్తిన హైడ్రామా మధ్య బీజేపీ నాలుగో సీటును దక్కించుకుంది. యూపీ(10), జార్ఖండ్ (2),పశ్చిమ బెంగాల్ (5), కర్నాటక (4), తెలంగాణ (3),చత్తీస్‌గఢ్ (1),కేరళ (1) రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. యూపీలో అనూహ్యంగా తొమ్మిదో సీటు కూడా దక్కడంతో కమలానికి రాజ్యసభలో మరింత బలం చేకూరినట్టయింది. ఇప్పటికే అతిపెద్ద పార్టీగా పెద్దల సభలో ఉన్న బీజేపీకి తాజా ఫలితాలు మరింత ధీమాను కలిగించాయి. యూపీలో బరిలోకి దిగిన 8మంది బీజేపీ అభ్యర్ధులకు 39ఓట్ల చొప్పున వచ్చాయి. తొమ్మిదో అభ్యర్థి అనిల్ కుమార్ అగర్వాల్ ఇండిపెండెంట్, రెబెల్ ఎమ్మెల్యేల సహకారంతో గెలుపొందారు. తాను క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీకే ఓటు వేశానని బిఎస్‌పి ఎమ్మెల్యే అనిల్ సింగ్ బాహటంగానే ప్రకటించాడు. ఈ కీలక ఓటుతోనే బీజేపీకి తొమ్మిదో సీటూ దక్కింది. తద్వారా సమాజ్‌వాది పార్టీ-బీఎస్‌పీ కూటమి నుంచి వచ్చిన సవాలను అధిగమించి బీజేపీ తన సత్తా చాటుకుంది. ఇండిడెండెంట్ ఎమ్మెల్యేల మద్దతుతో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి జయాబచ్చన్ గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లోని ఐదు స్థానాల్లో నాలుగు సీట్లను అధికార తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక్క స్థానం కాంగ్రెస్‌కు లభించింది. అలాగే కర్నాటకలోని 4 సీట్లలో 3 సీట్లు అధికార కాంగ్రెస్‌కు దక్కగా ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. తెలంగాణలోని 3 సీట్లలోనూ అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. జార్ఖాండ్‌లోని 2 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్‌లు చెరోటి పంచుకున్నాయి.
యూపీ 10
బీజేపీ 9
ఎస్పీ 1
*

పశ్చిమ బెంగాల్ 5
టీఎమ్‌సీ 4
కాంగ్రెస్ 1
*
కర్నాటక 4
కాంగ్రెస్ 3
బీజేపీ 1
*
జార్ఖండ్ 2
బీజేపీ 1
కాంగ్రెస్ 1
*
చత్తీస్‌గఢ్ 1
బీజేపీ 1
*
కేరళ 1
ఎల్‌డిఎఫ్ 1