జాతీయ వార్తలు

87మంది భారత జాలర్లను విడుదల చేసిన పాకిస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి: భారత్‌కు సంబంధించి పాకిస్తాన్ ఆదివారం ఒక సానుకూల చర్య తీసుకుంది. తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ అరెస్టు చేసిన భారతీయ మత్స్యకారుల్లో 87 మంది ఆదివారం విడుదల చేసింది. మరో 86 మంది ఈ నెల చివరలో విడుదల చేయనుంది. గత రెండున్నర సంవత్సరాలుగా ఈ మత్స్యకారులు పాకిస్తాన్‌లోని లాంధీ జైలులో మగ్గుతున్నారు. ఈది ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ అధినేత ఫైసల్ ఈది ఈ మత్స్యకారులు భారత్‌కు చేరుకోవడానికి వీలుగా ఆదివారం రైలు టికెట్లు సమకూర్చారు. వారికి కొన్ని బహుమతులు, కొంత నగదు కూడా అందజేశారు. మరో 86 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 20న విడుదల చేస్తామని లాందీ జైలు సూపరింటెండెంట్ షకీర్ షా ఒక వార్తాసంస్థకు చెప్పారు. పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించినందుకు గాను భారత్‌కు చెందిన మొత్తం 536 మంది మత్స్యకారులు తమ జైళ్లలో ఉన్నారని ఆయన వివరించారు.
31మంది మత్స్యకారుల అరెస్టు
రామేశ్వరం: తమిళనాడుకు చెందిన 31 మంది మత్స్యకారులను ఆదివారం శ్రీలంక నావికా సిబ్బంది అరెస్టు చేశారు. తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ శ్రీలంక వీరిని అరెస్టు చేసింది. మత్స్యకారులు ఉపయోగించిన మూడు దేశవాళీ పడవలను, ఒక మర పడవను కూడా శ్రీలంక అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక ఇలా తమిళనాడు మత్స్యకారులను అరెస్టు చేయడం ఈ వారంలో ఇది రెండోసారి. ఈ నెల 3న ఎనిమిది మంది మత్స్యకారులను శ్రీలంక అరెస్టు చేసింది. ఆదివారం నాటి అరెస్టులతో శ్రీలంక అదుపులో ఉన్న తమిళనాడు మత్స్యకారుల సంఖ్య 66కు పెరిగింది.

పాక్ ప్రభుత్వం నుంచి విముక్తి పొంది ఆదివారంనాడు కరాచీలోని రైల్వే స్టేషన్‌లో
తమ సొంత ఊరికి పయనమవుతున్న భారత జాలర్లు