శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

టీడీపీ పాలనలోనే చేతివృత్తిదారుల సంక్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, ఏప్రిల్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదరణ పథకంతో రాష్ట్రంలోని చేతి వృత్తిదారుల సంక్షేమం సాధ్యమని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. మంగళవారం నగరంలోని విఆర్సీ మైదానంలో ఆదరణ పథకం పరికరాల ప్రదర్శనశాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టాళ్ళ నిర్వాహకులతో మాట్లాడి వివిధ చేతివృత్తి ఆధారిత అధునాతన పరికరాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదరణ పథకం గొప్పతనాన్ని వివరించారు. అన్ని పరికరాలపై ప్రభుత్వం 70 శాతం సబ్సిడీని అందిస్తూ బ్యాంకుల నుంచి 20 శాతం రుణం మంజూరు చేయిస్తుందని, లబ్ధిదారులు కేవలం పది శాతం మొత్తం వెచ్చించి పరికరాలను సొంతం చేసుకోవచ్చన్నారు. రుణాల రూపంలో నిధులను మంజూరు చేయడంకన్నా లబ్ధిదారునికి నేరుగా పరికరాలను అందించడం ద్వారా సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. పురాతన చేతివృత్తులను కాపాడుకుంటూ అధిక ఉత్పత్తిని సాధించేందుకు వాటికి అవసరమైన అధునాతన యాంత్రిక విధానాలను అమర్చటం ద్వారా సంప్రదాయ కార్మికుల మనోభావాలను గౌరవిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ననే్నసాహెబ్, తాళ్ళపాక అనూరాధ, మామిడాల మధు, కినె్నర ప్రసాద్, షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బపై అవగాహన ఉండాలి
ప్రజలకు మేయర్ అజీజ్ సూచన
నెల్లూరుసిటీ, ఏప్రిల్ 10: వేసవికాలం ఎండవేడిమి దృష్ట్యా నగర ప్రజలందరూ వడదెబ్బ ప్రభావం గురించి అవగాహన పెంచుకుని కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. మంగళవారం ట్రంకురోడ్డులోని పాజిటివ్ హోమియోపతి వైద్య కేంద్రంలో హోమియోపతి పితామహుడు శామ్యూల్ హనీమన్ జయంతిని పురస్కరించుకుని వేడుకలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 17వ శతాబ్దంలో జర్మనీ దేశస్తుడైన వైద్యులు హనీమన్ వైద్య రంగంలో నూతన ఒరవడికి నాంది పలుకుతూ అల్లోపతి వైద్య విధానానికి ప్రత్యామ్నాయంగా హోమియోపతి విధానాన్ని ఆవిష్కరించారని తెలిపారు. అన్ని శారీరక రుగ్మతులను దూరం చేసే అతి తక్కువ ఖర్చుతో కూడిన వైద్య విధానం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని ఆకాక్షించారు. అనునిత్యం క్రమబద్ద వ్యాయమం, పౌష్టికాహారం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటే ఏలాంటి అనారోగ్యాలు దరిచేరవని అన్నారు. నగర ప్రజల ఆరోగ్య భద్రతకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ననే్నసాహెబ్, సత్యనాగేశ్వరరావు, వౌలానా తదితరులు పాల్గొన్నారు.

జాయింట్ కలెక్టర్‌గా వెట్రి సెల్వి
నెల్లూరు, ఏప్రిల్ 10: నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వెట్రి సెల్విని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చెన్నైకు చెందిన వెట్రిసెల్వి ప్రకాశం జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. 2016లో మదనపల్లి సబ్ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం ఆమెకు పదోన్నతి కల్పిస్తూ నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈమె త్వరలోనే నెల్లూరు జేసీగా బాధ్యతలు చేపట్టనున్నారు.