జాతీయ వార్తలు

ఆధార్‌తో మనీ లాండరింగ్‌ను నివారించగలరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే మనీలాండరింగ్‌ను నివారించడంలో ఆధార్‌కార్డు ఏవిధంగా ఉపయోగపడుతుం దో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరిం ది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీ పక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యా యమూర్తులతో కూడిన ధర్మాసనం ఆధార్ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై బుధవా రం విచారించింది. ప్రపంచ వ్యాప్తంగా హ వాలా లావాదేవీలు కొనసాగుతున్న నేపథ్యంలో 12 అంకెలతో కూడిన యూనిక్ ఐ డెంటిఫికేషన్ నెంబరు వీటిని అరికట్టడానికి ఉపయోగపడుతుందని, ప్రభుత్వం పేర్కొంది.
ఈ నెంబరు కారణంగా రూ.33 వేల కోట్ల నల్లధనాన్ని అధికార్లు వెలికితీయగలిగారని పేర్కొంది. ఆధార్ నెంబరును పాన్‌కార్డుతో అనుసంధానించడంతో పన్ను ఎగ్గొట్టడాన్ని నివారించవచ్చునని పేర్కొంది. యుఐడీఏఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు.