హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ క్రీడల్లో సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆన్‌లైన్‌లోనే క్రీడా పరికరాల కేటాయింపు * ఎప్పటికపుడు వెబ్‌సైట్‌లో సమాచారం
హైదరాబాద్, ఏప్రిల్ 19: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలను అందించటంలో దేశవ్యాప్తంగా స్థాని సంస్థల్లో జీహెచ్‌ఎంసీ ముందుంజలో ఉంది. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల్లో దేశంలో ఎక్కడా లేని ఆధునిక విధానాన్ని అమలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ ఇపుడు క్రీడా విభాగంలోనూ పలు సంస్కరణలను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. కేవలం ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులకు అందుబాటులో ఉన్న క్రీడామైదానాలు,ప్లే గ్రౌండ్స్‌లు, ఇండొర్ స్టేడియంలను పరిమిత సమయాల్లో అద్దెకు ఇవ్వాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ క్రీడా కార్యకలాపాల్లో మరింత పారదర్శకతను సాధించేందుకు వీలుగా వేసవి క్రీడాశిక్షణ శిబిరాలకు హాజరయ్యేవారు కూడా తమ వివరాలను ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకోవాలన్న నిబంధన విధించిన జీహెచ్‌ఎంసీ ఇపుడు క్రీడా పరికరాలను కూడా ఆన్‌లైన్‌లోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. శిక్షణ పొందేవారు, వారికి అవకాశమిచ్చేవారు కూడా ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఆన్‌లైన్‌లో స్లాట్‌ను బుకింగ్ చేసే విధానాన్ని మొట్టమొదటి సారిగా జీహెచ్‌ఎంసీ అమలు చేస్తోంది. తాజాగా ఏ ఏ క్రీడాంశాల్లో ఎంత మొత్తంలో క్రీడా పరికరాలు, సామాగ్రి అవసరం అనేది ఆన్‌లైన్‌లో స్లాట్‌ల బుకింగ్ ఆధారంగా సంబంధిత గేమ్స్ ఇన్‌స్పెక్టర్లు, డిప్యూటీ కమిషనర్ల ద్వారా జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్లకు ఇండెంట్ పంపించాల్సి ఉంటుంది. డిప్యూటీ కమిషనర్లు, జోనల్ అసిస్టెంటు డైరెక్టర్లు ఈ ఇండెంట్‌లను జోనల్ కమిషనర్లు వీటిని పరిశీలించి ఆమోదిస్తారు. ఈ విధానంతో ఆయా సర్కిళ్లలో కావల్సిన స్పోర్ట్స్ మెటీరియల్ వివరాలు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచనున్నారు. స్పోర్ట్స్ జోనల్ అసిస్టెంటు డైరెక్టర్లు పంపిన ఇండెంట్‌ను ఆన్‌లైన్‌లో పరిశీలించటానికి సీనియర్ అధికారులైన స్పోర్ట్స్ విభాగం అదనపు కమిషనర్, డైరెక్టర్, విజిలెన్స్ డైరెక్టర్ కూడా పరిశీలించేలా లాగిన్ చేయనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ముందుగా ఆమోదించిన మేరకే స్పోర్ట్స్ మెటీరియల్‌ను అందించేందుకు వీలు కలుగుతోంది. దీంతో ఏ క్రీడాంశానికి ఏ స్టేడియంలో ఎంత విలువ చేసే, ఏఏ క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారనే వివరాలు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. తద్వారా గతంలో మాదిరిగా రికార్డుల్లో అధిక మొత్తంలో క్రీడాసామాగ్రిని చూపించి అక్రమాలకు పాల్పడటం, క్రీడా సామాగ్రి కొరత ఉందన్న ఫిర్యాదులకు అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు.