ఉత్తరాయణం

న్యాయ పాలికకు పగ్గాలు వేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి జోసెఫ్ పేరును కొలీజియం సిఫార్సుచేయగా, కేంద్ర ప్రభుత్వం అందుకు అభ్యంతర పరచడం అన్యాయం. అలా అభ్యంతర పరిచే హక్కు కేంద్రానికి ఉన్నప్పటికీ, అందుకు ఉటంకించిన కారణం సరైంది కాదు. జోసెఫ్ కన్నా ఆ పదవికి పోటీపడే సీనియర్లున్నారని, ఆ రాష్ట్రం నుండి ఇప్పటికే ప్రాతినిధ్యం ఉందని ఏవేవో కారణాలు ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రస్తుత నియమాల ప్రకారం అవేవీ అనర్హత కారకాలు కావు. గతంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనని ఎత్తివేయించడం ద్వారా జోసెఫ్ బీజేపీకి అయిష్టత కలిగించారు. ఆ చర్యవల్ల రాజ్యాంగ ధర్మం కాపాడబడింది. న్యాయపాలిక నిష్పక్షపాత ధోరణి, స్వతంత్రత, గౌరవం ఇనుమడించి ప్రజల్లో విశ్వాసం నింపింది. అందుకు ప్రశంసించాల్సిందిపోయి ఆయన పదోన్నతిని కుంటిసాకులతో అడ్డుకోచూడడం బీజేపీకి గానీ, కేంద్రానికి గానీ శోభనివ్వదు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా తీర్పిచ్చిన న్యాయమూర్తులకు అడ్డంకులు తప్పవని పరోక్ష సందేశమివ్వడం దుందుడుకుతనం. గతంలో అత్యవసర స్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసి, అన్ని వ్యవస్థలతోబాటు న్యాయ వ్యవస్థని కూడా గుప్పెట్లో పెట్టుకోవడం, అందరితోబాటు అవస్థలు పడ్డ బీజేపీ ఆ విషయమై నేటికీ కాంగ్రెస్‌ను బోనులో నిలబెట్టడం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక అదే దారిపట్టడం దివాలాకోరుతనం. సుప్రీం కోర్టు కొలీజియం మళ్ళీ అదే పేరు సిఫార్సుచేస్తే కేంద్రం ఒప్పుకోక తప్పదు. అప్పటికైనా కాలయాపన చెయ్యడం లాంటి విద్యలతో అదే బాట పట్టొచ్చు. అయితే అధికార పక్షాల ధోరణి గుర్తించి సుప్రీం తన స్వతంత్రతని నిలుపుకోవడంలో అప్రమత్తత చూపించడం ప్రజాస్వామ్యానికి అవసరం. న్యాయమూర్తుల నియామకాల విషయమై ప్రాంతీయ, సామాజిక సమతుల్యతలు పాటించేలా పారదర్శక వ్యవస్థ నేర్పరుచుకోవడం ముఖ్యం.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

ఎదుటివారికే సలహాలు..
ఏ దేశంలోనూ ఏ నేతకూ లేనంత భావప్రకటనా స్వేచ్ఛ మన నేతలకుంది. తాము చెప్పేది అబద్ధం అని తెలిసినా మనవాళ్లు వాగాడంబరం మానరు. ఢిల్లీకి వెళ్లి విపక్ష నేతలను కలిసేకంటే చంద్రబాబు నేరుగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి కాలర్ పట్టుకొని నిలదీస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సెలవిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు గాని, విభజన చట్టంలో గాని హోదా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ తాము రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే హోదా ఇచ్చేస్తాం అంటున్నది. కనుక చంద్రబాబుకి తాము ఇచ్చిన సలహానే తమ బాస్ రాహుల్ గాంధీకిస్తే ఆయన మోదీ కాలర్ పట్టుకొని హోదా సాధించి హామీ నెరవేర్చుకోవచ్చుకదా!
- శాండీ, కాకినాడ