శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రాష్ట్రంలో 12,800 రైతు రథాలు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, మే 17: రాష్ట్రంలో 12,800 రైతు రథాలను రైతులకు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని నిమ్మ మార్కెట్ యార్డులో గురువారం ఆయన మినుము, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు 1030, సర్వేపల్లికి 186 రైతు రథాలను అందచేశామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తెచ్చి రైతులకు వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. 1.55 లక్షల టన్నుల కందులను కొనుగోలు చేశామని ప్రస్తుతం మినుములను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకొంటున్నామని ఆయన తెలిపారు. 2016లో అనంతపురంలో వచ్చిన కరవుకు 1450 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ కింద పంపిణీ చేశామన్నారు. 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.370 కోట్లు ఖర్చుచేస్తే తమ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.3070 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాజకీయ జీవితంలోకి వచ్చాక ఎంత వీలుంటే అంత ప్రజలకు సేవ చేసే తపన ఉండాలని సోమిరెడ్డి సూచించారు. పొదలకూరులో రూ.4.50 కోట్లతో ఎన్టీఆర్ సుజల స్రవంతిని ఏర్పాటు చేయిస్తామన్నారు. దీని ద్వారా మండలంలోని 27 పంచాయతీలకు ట్యాంకర్ల ద్వారా 2 రూపాయలకే 20 లీటర్లు తాగునీరు అందిస్తామన్నారు. పొదలకూరు నిమ్మమార్కెట్ యార్డును రూ.1.85 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పి వెంకటరత్నం నాయుడు, షేక్ చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

చుక్కల దుప్పి మృతి
కలిగిరి, మే 17: మండలంలోని కృష్ణారెడ్డిపాళెంలో కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతిచెందిన సంఘటన జరిగింది. గ్రామస్తులు, ఫారెస్టు అధికారుల వివరాల మేరకు చుట్టుప్రక్కల అటవీ ప్రాంతం నుంచి నీటికోసం గ్రామంలోకి చుక్కల దుప్పి రావటంతో కుక్కలు గమనించి దాడికి ప్రయత్నించాయి. గ్రామంలో దుప్పి పరుగులు తీసినప్పటికీ కుక్కలు చుట్టుముట్టి దాడి చేయడంతో కోదండరామాలయం సమీపంలో మృతి చెందింది. దుప్పిని చూసేందుకు పిల్లలు, పెద్దలు బారులు తీరారు. మూగజీవి కుక్కలకు బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కలిగిరి ఏఎస్సై అజుముతుల్లా, ఫారెస్టు అధికారి నాయబ్ రసూల్ చనిపోయిన దుప్పికి శవపంచనామ నిర్వహించి అడవిలో ఖననం చేసారు.