హైదరాబాద్

కర్మచారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సఫాయి కర్మచారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ చైర్మన్ మన్హర్ వాల్జీ భాయ్ జాలా ఆదేశించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సఫాయి కర్మచారుల అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రఘునందన్ రావుతో పాటు జిల్లా యంత్రంగం పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సఫాయి కర్మచార వృత్తి చేస్తున్న వారి కోసం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు అయినప్పుడే వారి అభివృద్ధి సాధ్యమని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సఫాయి కార్మికుల చేస్తున్న కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకరమైన డ్రైనేజీల్లో దిగి వాటిని శుభ్రపరుస్తూ ఎంతో మంది మృతిచెందారని అన్నారు. అలాంటి వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుపున అందిస్తున్న నష్టపరిహారాన్ని తక్షణమే అందించాలని ఆదేశించారు. కర్మచారి వృత్తిలో కొనసాగుతున్న కుటుంబాలకు సంవత్సరంలో రెండు సార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, కార్మికులకు బీమా వర్తింప చేయాలని సూచించారు. అత్యంత పరిశుభ్రమైన పరిసరాలను శుభ్ర పరుస్తూ అతి ప్రమాదకర ప్రాంతాల్లో జీవిస్తున్న వారి బాగోగుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని అన్నారు. సమావేశానికి వచ్చిన సఫాయి కర్మచారుల సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. కుల దృవీకరణ పత్రాలు జారీ చేయడంలో అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పగా వారి పరిస్థితులను అర్ధం చేసుకొని జాప్యం లేకుండా కుల దృవీకరణ పత్రాలు జారీ చేయాలని కోరారు. గృహ వసతి కల్పించడం, వారి పిల్లలకు విద్య కోసం అధికారులు పూర్తిగా సహకరించాలన్నారు. 1993 అనంతరం మృతిచెందిన కర్మచారుల కుటుంబాలకు సైతం ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరారు. కర్మచారులను సామాజికంగా, ఆర్థికంగా, విద్యపరంగా అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. కర్మచారి వృత్తి ఎంతో గొప్పదో ప్రధాని మోడీ స్వయంగా చీపురు పట్టి ప్రపంచానికి చాటారని తెలిపారు.
కర్మచారి కుటుంబాల్లో చదువుకున్న వారికి రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దయనీయంగా జీవితాలు వెల్లదీస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు. సఫాయి కర్మచారులకు కులధ్రువీకరణ పత్రాలు త్వరగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని, రెండు పడక గదుల కేటాయింపులోనూ వారికి ప్రాధాన్యం కల్పిస్తామని కలెక్టర్ రఘునందన్ రావు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, డీఆర్‌ఓ శోభ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి రంగనాధ్, ఆర్టీ ఓలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మధుకర్ రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.