జాతీయ వార్తలు

అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 20: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుడు అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా చేశారు. కేంద్రంలో కీలకమైన బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనానమిక్స్‌లో సీనియర్ ఫెలోగా పనిచేశారు. ఆయన వయస్సు 59 ఏళ్లు. రఘురాం రాజన్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియమితులు కావడంతో, ప్రధాన ఆర్థిక సలహాదారు పదవిలో సుబ్రమణియన్ చేరారు. ఆయన ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ఫ్ మేనేజిమెంట్ అహ్మదాబాద్, ఆక్స్‌ఫర్డ్ వర్శిటీలో విద్యాభ్యాసం జరిగింది. రెండేళ్ల క్రితం ఆర్థికవేత్త, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఒకానొక సందర్భంలో సుబ్రమణియన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా ఆ సమయంలో సుబ్రమణియన్‌ను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వెనకేసుకుని వచ్చారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా ఆశ్చర్యం కలిగించలేదని, మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న దివాలా ఆర్థిక విధానాలతో విసుగెత్తి పదవులకు గుడ్ బై చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. బుధవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ల ఇన్‌చార్జీ రణదీప్ సూర్జీవాలా మాట్లాడుతూ, నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా మోదీ ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాలతో రాజీపడలేక కీలక పదవుల నుంచి తప్పుకున్నారన్నారు. ఆర్థిక అరాచకత్వం, తిరోగమన ఆర్థిక విధానాలను ఆర్థిక నిపుణులు అంగీకరించలేకపోయారన్నారు. ఈ వివరాలను ఆయన ట్వీట్ చేశారు. కాగా కుటుంబపరమైన వత్తిడి తదితర కారణాల వల్ల అరవింద్ సుబ్రమణియన్ పదవి నుంచి తప్పుకున్నారని, నాలుగు సంవత్సరాల పాటు ఆర్థిక శాఖ సలహాదారుడుగా కొనసాగారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
2014 అక్టోబర్ 16వ తేదీన అరవింద్ సుబ్రమణియన్ ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుడిగా చేరారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు. 2017 అక్టోబర్‌లో సుబ్రమణియన్ పదవీ కాలాన్ని పొడిగించారు. ఇటీవల తనతో వీడియో కాన్ఫరెన్సులో సుబ్రమణియన్ మాట్లాడుతూ, కుటుంబ పరమైన కారణాల వల్ల అమెరికాకు తిరిగి వెళ్లనున్నట్లు చెప్పారని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఆ కారణాలు వ్యక్తిగతమైనవి అయినప్పటికీ, ప్రధానమైనవన్నారు. అందుకే సుబ్రమణియన్ రాజీనామాను అంగీకరించని పరిస్థితులు తలెత్తాయన్నారు. ఈ వివరాలను ఫేస్‌బుక్‌లో జైట్లీ పోస్టు చేశారు. కాగా సుబ్రమణియన్ విధుల నుంచి తప్పుకుంటారనే విషయమై స్పష్టత ఇవ్వలేదు. నిర్దేశించిన నిబంధనల మేరకు త్వరలో అరవింద్ సుబ్రమణియన్ స్థానంలో కొత్త సలహాదారుడిని నియమిస్తామని జైట్లీ అన్నారు. అరవింద్ బాధ్యతల నుంచి తప్పుకోవడం వ్యక్తిగతంగా తనకు నష్టమని ఆయన అన్నారు. ట్వీట్‌లో థ్యాంక్యూ అరవింద్ అని జైట్లీ పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ తన రాజీనామాను అంగీకరించడంపై సుబ్రమణియన్ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని, పరిశోధనలు, రచనా వ్యాసంగ బాధ్యతలు చేపట్టనున్నట్లు సుబ్రమణియన్ తెలిపారు.