హైదరాబాద్

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో పర్యావరణ పరిరక్షణ, మానవ మనుగడ కోసం ఒకవైపు పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తూనే, అందుకు సమాంతరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను భారీగా చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్లాస్టిక్ బ్యాగ్‌ల స్థానంలో క్లాత్, జ్యూట్ బ్యాగ్‌ల వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గాను అందుకు అవసరమైన భారీ స్థాయిలో ఈ బ్యాగ్‌లను తయారు చేసి, అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం నగరంలోని స్వయం సహాయక బృందాలతో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో 50 మైక్రాన్లకన్నా తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్ కవర్లను నిషేధించటంతో పాటు ఇతర ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయం వచ్చినపుడే నిషేధం పూర్తి స్థాయిలో ఫలిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇళ్లలోని ఫ్రిజ్‌లలో కూరగాయల నిల్వకు ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని, అలా కాకుండా ప్లాస్టిక్ స్థానంలో జ్యూట్, క్లాత్ బ్యాగ్‌లను వినియోగించే పరిస్థితి రావాలని, అందుకు అవసరమైన మోతాదులో మార్కెట్‌లో క్లాత్, జ్యూట్ బ్యాగ్‌లు అందుబాటులోకి రావాలని వివరించారు. ఇందుకు గాను తొలిదశలో 68 స్వయం సహాయక బృందాలను గుర్తించామని, వారికి సంచుల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వటంతో పాటు వారికి కావల్సిన ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తామని కమిషనర్ తెలిపారు. ఇందుకు కొన్ని బ్యాంకులు ఇప్పటికే సుముఖతను వ్యక్తం చేసినట్లు వివరించారు. జ్యూట్, క్లాత్ బ్యాగ్‌ల మార్కెటింగ్‌కు మంచి భవిష్యత్ ఉన్నందున, వాటి తయారీకి ముందుకు రావాలని మహిళా ఔత్సాహికులను కోరారు. చేతి సంచుల తయారీ విషయంలో జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం ప్రత్యేకంగా తగు సలహాలు, ఆర్థిక, సహాయక, మార్కెటింగ్ తదితర అంశాలపై తగిన సూచనలిచ్చేందుకు తగు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. జ్యూట్, క్లాత్ బ్యాగ్‌ల తయారీ అనంతరం జరిపే మార్కెటింగ్‌కు 18 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారని, దీన్ని తగ్గించేందుకు సంబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.