జాతీయ వార్తలు

ప్రచారానికి బదులు ప్రజలను చైతన్యం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రజలను గందరగోళంలో పడేసే రకరకాల ప్రచారాలకు బదులు ఆరోగ్యం లాం టి అంశాలపై మీడియా గనుక నిరంతర ప్రచారోద్యమం నిర్వహించిన పక్షంలో వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి తోడ్పడుతాయని కేం ద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆర్థిక శాఖతో పాటుగా సమాచార, ప్రసారాల శాఖను కూడా నిర్వహిస్తున్న జైట్లీ శుక్రవారం ఇక్కడ ఆరవ జాతీయ కమ్యూనిటీ రేడియో సమ్మేళనంలో మాట్లాడారు. ఈ సమ్మేళనంలో వినూత్నమైన ప్రోగ్రామ్‌లను రూపొందించినందుకు టీవీ చానళ్లకు అవార్డులను సైతం అందజేశారు. ప్రజలను గందరగోళంలో పడవేసే రకరకాల ప్రచారాలు చేయడానికి బదులు చానళ్లు గనుక ఆరోగ్యం, ముందస్తు వైద్య సంరక్షణ లాంటి అంశాలపై ఈ తరహా నిరంతర ప్రచారం గనుక చేసినట్లయితే అది ప్రజల మనసుల్లోకి బలంగా చొచ్చు కు పోతుందని, రేడియో విద్యా రంగంలో ఒక బలమైన సాధనం అవుతుందని ఆరోగ్య ప్రచారానికి గాను కమ్యూనిటీ రేడియో అవార్డును అందుకోవడాన్ని ప్రస్తావిస్తూ జైట్లీ చెప్పారు. భారత దేశంలో పంటల తీరు, వాతావరణం జిల్లా, జిల్లాకు వేరుగా ఉంటుందని, ఈ విషయాల్లో ప్రజలకు సమాచారం అందించడంతో పాటుగా వారికి అవగాహన కల్పించడంలో కమ్యూనిటీ రేడియో పాత్ర రోజురోజుకు ప్రాముఖ్యతను సంతరించుకుంటోందని మంత్రి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా దినపత్రికలు కుంచించుకు పోతూ ఉంటే మన దేశంలో మాత్రం ప్రాంతీయ దినపత్రికలు విస్తరిస్తున్నాయని ఆయన అంటూ, కమ్యూనిటీ రేడియోకు కూడా ఇదే తీరు వర్తిస్తుందని చెప్పా రు. దాదాపు 400 కమ్యూనిటీ రేడియో సెంటర్లకు అనుమతి ఇస్తే 191 దాకా కేంద్రాలు పని చేస్తున్నాయని ఆయన చెప్పారు. అందువల్ల కమ్యూనిటీ రేడియో కేంద్రాలకు సంబంధించినంతవరకు గణనీయమైన వృద్ధి, కనెక్టివిటీ ఉన్నాయన్నారు. రేడియో, టెలివిజన్లు ప్రభుత్వ గుత్త ఆస్తులనే భావన దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉండేదని, అయితే కేవలం ప్రభుత్వ అధీనంలో ఉండే రేడియో, టెలివిజన్ ద్వారా ప్రజల అవసరాలను తీర్చలేనందున ఆ ధోరణి మారాల్సి వచ్చిందని జైట్లీ చెప్పారు. స్పెక్ట్రమ్ అందరికీ అందుబాటులోకి తేవడంతో పెద్ద సంఖ్యలో టీవీ చానళ్లు, ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఒక దశలో టెలివిజన్ ఒక్కటే ప్రాధాన్యత సంతరించుకుంటుందని అనిపించిందని, అయితే ఎఫ్ ఎం చానెళ్ల రాకతో ఇప్పుడు రేడియో కూడా భారీగా విస్తరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, ఆ శాఖ కార్యదర్శి సునీల్ అరోరా కూడా పాల్గొన్నారు.