జాతీయ వార్తలు

త్వరలో ‘రేప్ కిట్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాల కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయడానికి, బాధితులకు సత్వర న్యాయం జరగడానికి కేంద్రం తన చర్యలను వేగవంతం చేసింది. అత్యాచార, అఘాయిత్య కేసుల విచారణలో ఉపయోగించే ఐదువేల కిట్లను దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్‌స్టేషన్లకు ఇవ్వాలని నిర్ణయించినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎన్నిక చేసిన పోలీస్‌స్టేషన్లకు తక్షణం అయిదు కిట్ల చొప్పున అందజేస్తామని, ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు కూడా భాగస్వామ్యం వహించాలని కోరారు. అత్యాచారం, అఘాయిత్యానికి సంబంధించిన కేసుల్లో బాధితులకు ఈ కిట్లను బాధితుల వద్దకు తీసుకువెళ్లే విధంగా ఉంటాయని, వీటి ద్వారా బాధితులను పరీక్షించడానికి, ఆధారాలను సేకరించడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే ఐదు వేల కిట్లను సిద్ధం చేశామని, వీటిని ఎన్నికచేసిన స్టేషన్లకు అందజేస్తామని, అత్యాచార కేసుల సత్వర దర్యాప్తుకు ఇవి ఎంతో తోడ్పడతాయని తెలిపారు. ఈ కిట్‌లో టెస్టుట్యూబ్‌లు, బాటిల్స్ తదితరమైనవి ఉంటాయన్నారు.
ఈ కిట్లను పోలీస్‌స్టేషన్లకు అప్పగించాలని ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఆయా రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాయని, హర్యానా ప్రభుత్వమైతే ఈ కిట్లను కొనుగోలు కూడా చేసిందన్నారు. అత్యాచారం వంటి కేసుల్లో కచ్చితమైన సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ లేబరేటరీలకు పంపాల్సి ఉంటుంది. అయితే బాధితుల నుంచి వైద్యపరమైన సాక్ష్యాలు సేకరించడం, అవి ఫోరెన్సిక్‌కు పంపడంలో పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాటిని అధిగమించడానికి ఈ కిట్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కిట్ల ద్వారా రక్తం, వీర్యం, ఉమ్మి లాంటి శాంపిల్స్ సేకరించడమే కాకుండా, వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపవచ్చు. దీనివల్ల శాంపిల్స్ సేకరణ, పోలీసులు రావడం, దానిని డాక్టర్ దగ్గరకు పంపడం, వంటి ప్రక్రియ లేకుండా నేరుగానే శాంపిల్స్ సేకరించి పంపవచ్చు. కాగా సరైన సంఖ్యలో ఫోరెన్సిక్ లేబ్‌లు లేకపోవడంతో ప్రతి సంవత్సరం 13వేల అత్యాచార కేసుల్లో ఫోరెన్సిక్ విశే్లషణకు నోచుకోవడం లేదని ఆమె చెప్పా రు. కేవలం 1500 శాంపిల్స్‌ను మాత్రమే విశే్లషించే సామర్థ్యం ఫోరెన్సిక్ లేబ్‌లకు ఉందన్నారు. ఈ స్థాయిని 20 వేలకు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పు డు రేప్ కిట్లను అందజేయడంతో కేసుల పరిశోధన మరింత త్వరగా పూర్తికావడానికి ఫోరెన్సిక్ లేబ్‌ల అవసరం ఇప్పుడు మరింతగా పెరిగిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం 2014లో 36,735, 2015లో 34,651 కేసులు, 2016లో 38,947 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. మహిళలకు సంబంధించి మొత్తం నమోదవుతున్న కేసులలో 12 శాతం అత్యాచారం కేసులేనని ఆమె వివరించారు.