Others

ఏమో ఎడిసన్ కానూవచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రసన్నోషోదయ సమయాన
తిమిరపు తెరలు తొలగే తరుణాన
మూసి ఉన్న అంగళ్ళముందు
ముడుచుకొని, వరుసలో కూర్చొని
అనుబంధాలను పత్రికలలో అమర్చుకుంటూ
కట్టలు కట్టుకుంటూ
నిర్దేశింపబడ్డ క్షేత్రాలకై నిష్క్రమించబోతున్న
మన బార్నీ ఫ్లా హెర్టీ వారసులు.

ఉపాహారం లేక ఉత్త తేనీటితో సంతృప్తి
మిత్ర బృందాల ఉభయ కుశలోపరి.
తదుపరి, తమతమ సమస్యల సామూహిక చర్చ
కష్ట, సుఖాల, అనుభవాల పరస్పర అవగాహన
కుటుంబ, రాజకీయ, సినిమా, క్రీడా విషయాల
ఆసక్తికర చర్చ.

మందస్మిత ముఖ కవళికల కేరింతలానంతరం
సైకిల్ పై వ్యాయామాన్ని ఇష్టంతో
కనీస ఖర్చులకై కష్టంతో
ఉదయం వార్తావాహకుడుగా
మధ్యాహ్నం విద్యార్థిగా
సాలుకు నాలుగు పండుగ రోజుల సెలవులతో
వర్షాకాల, శీతాకాల అసౌకర్యాల నధిగమించి
బస్తీలు, బజార్లు, బహుళ అంతస్తు భవనాలు,
విద్యాలయాలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు
సందులు, గొందులలో సైకిల్‌పై విన్యాసాలు.
విన్యాసాలు చేసే హీరో హస్తలాఘవంతో
విసిరేసిన పత్రిక తడిస్తే, పక్కింట్లో పడితే
ఒకరోజు గైర్హాజరయతే,
చందాదారునిచే చీవాట్లు.
‘అమ్మ వైద్య ఖర్చులకు’ నేనిస్తే తనకు ‘వస్తుందని’
అడిగాడు చందాని పేపర్ బాయ్.
అనిపించింది నా అంతరంగంలో, అలా...
పేపర్లమ్మి ఎడిసన్ ఎంత పెద్దవాడయ్యాడు!
ఏమో, ఎడిసన్ కానూవచ్చు వీడూ!
అయనా అబ్దుల్ కలామ్ అవనూవచ్చని.

- వేదం సూర్యప్రకాశం, 9866142006