విశాఖ

రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిస్తేనే ప్రత్యేక హోదా సాధన సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఆగస్టు 14: రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా కలిసి కేంద్ర ప్రభుత్వంపై పోరాడితేనే ఏపీకీ ప్రత్యేక హోదా సాధన సునాయాసమవుతుందని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా సాధన కోసం ఆ ప్రాంతంలోని పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా ఒకే మాట ఒకే బాటగా పోరుబాట సాగించడంతో అప్పటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం తలవంచక తప్పలేదన్నారు. అదే పంధాను ఏపీకీ ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఒకే గళంతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిందని, తీర్మానం వీగిపోయినా నైతికంగా విజయం సాధించనట్టేనన్నారు. ఎన్నికల ప్రచార సభలో నరేంద్రమోడీ ఏపీకీ ప్రత్యేక హోదా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సాధిస్తామని, ఢిల్లీని మించిన నగరంగా ఏపీని తీర్చిదిద్దుతామని చేసిన ప్రకటనలు ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చాక తుంగలోకి తొక్కారన్నారు. విశాఖపట్నం ఎంపీ హరిబాబు సైతం విశాఖకు రైల్వేజోన్ సాధించి తీరుతామని చేసిన ప్రకటనను కార్యరూపంలోకి తీసుకురాలేకపోయారని విమర్సించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని రూపాల్లోను ద్రోహం చేసిందని, రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంపీ ముత్తంశెట్టి హెచ్చరించారు. జిల్లా దేశం ప్రధాన కార్యదర్శి బుద్ద నాగజగదీష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాయల మురళీ, మండల దేశం మాజీ అధ్యక్షులు కొణతాల శ్రీను, గుత్తా ప్రభాకర చౌదరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.