జాతీయ వార్తలు

అశ్లీల సైట్లపై కేంద్రం ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లో అశ్లీల సైట్లను అప్‌లోడ్ చేయడంపై ఉక్కుపాదం మోపాలని, అశ్లీల సాహిత్యాన్ని వాట్సప్‌ల ద్వారా ప్రచారం చేయడంపై వేటు వేయాలని కేంద్రమంత్రుల బృందం నిర్ణయించింది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్‌లను వినియోగిస్తూ అశ్లీల సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి కళ్లెం వేయాలని కేంద్రం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కేంద్రం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. మంగళవారం జరిగిన ఈ సమావేశానికి హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, న్యాయ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఒక ఎన్‌జీవో సంస్థ సుప్రీంకోర్టులో గతంలో సామాజిక మాధ్యమాల ద్వారా అశ్లీల సైట్ల విస్తృత ప్రసారం, ప్రచారాన్ని నిరోధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఈ విషయమై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.