జాతీయ వార్తలు

ఆ వీడియోకు ప్రభుత్వ ధనం వెచ్చించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఈ ఏడాది జూన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రూపొందించిన ఫిట్నెస్ వీడియోపై అధికారికంగా ఎలాంటి ఖర్చు చేయలేదని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ వీడియో రూపొందించేందుకు దాదాపు 35 లక్షల రూపాయలు వెచ్చించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశిధరూర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని ఫిట్నెస్ వీడియోపై దాఖలైన సరైన వివరాలు ఇవ్వాలని కోరిన మీదట సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద పీఎంఓ కార్యాలయం సమగ్ర వివరణ ఇచ్చింది. యోగా డే సందర్భంగా జూన్ 13న ప్రధాని మోదీ యోగా చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఫిట్నెస్‌పై చాలెంజ్ చేస్తున్నట్టు ఆ వీడియోను రూపొందించారు. ఈ వీడియో తయారీకి లక్షలు ఖర్చు చేశారని అప్పట్లో కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఆరోపించడంతో ప్రభుత్వం దానిని తీవ్రంగా ఖండించింది. ఈ ఫిట్నెస్ వీడియోను ప్రధాని ఇంట్లో, ప్రధానమంత్రి కార్యాలయ వీడియోగ్రాఫర్ షూట్ చేశారని, ఇందుకు ప్రభుత్వం ఎలాంటి అనవసర ఖర్చు చేయలేదని ఆర్‌టీఐకి వివరణ ఇచ్చింది.