జాతీయ వార్తలు

అంతా కేంద్రం నిర్వాకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, సెప్టెంబర్ 5: రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మిర్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతోమాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిపై పలువురు రకరకాల ప్రకటన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆర్టికల్ 370పై పలువురు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు కోరే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. జమ్మూకాశ్మీర్ చరిత్ర ప్రపంచానికంతటికీ తెలుసు. ఏ పరిస్థితుల్లో ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాల్సి వచ్చిందో కొత్తగా చెప్పాల్సింది లేదు. ప్రత్యేక పరిస్థితుల కారణంతోనే సొంత రాజ్యాంగం, ప్రతిపత్తి, ప్రత్యేక జెండా రూపొందించారు’అని మిర్ అన్నారు. వజ్రాత్ రోడ్‌లోని షాహీదీ చౌక్‌లోని జరిగిన బహిరంగ సభలో మిర్ మాట్లాడుతూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. జమ్మూకాశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిపై దోవల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు. ప్రతిపత్తిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని భద్రతా సలహాదారు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దోవల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మి‘ చిన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఉంది.
ఇది ఒక్క జమ్మూకాశ్మీర్‌కే కాదు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి’అని స్పష్టం చేశారు. కాగా దోడాలో ఎంబీఏ గ్రాడ్యుయేట్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర గ్రూపులో చేరినట్టు వచ్చిన వార్తలపై మిర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారూ తీవ్రవాదం వైపువెళ్లడం అత్యంత దురదృష్టకరని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్లే గత మూడేళ్లుగా ఇలాంటి పోకడలు తలెత్తుతున్నాయని పీసీసీ చీఫ్ తీవ్ర ఆరోపణ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడంతో కేంద్రం ఘోర వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. మొన్నటికి మొన్న పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అనంతనాగ్ లోక్‌సభకు ఉప ఎన్నిక జరపలేకపోయిందని మిర్ విరుచుకుపడ్డారు.పోలింగ్‌కు ఒక్క రోజు ముందు ఎన్నికను రద్దుచేసినట్టు ప్రకటించడం చేతగాని తనమేనని కాంగ్రెస్ నేత విమర్శించారు. వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత గవర్నర్‌పైనే ఉందని జీఏ మిర్ స్పష్టం చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్‌లో పాల్గొనేందుకు అనువైన పరిస్థితులను కేంద్రం, గవర్నర్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా బహిరంగ సభకు ముందు కాంగ్రెస్ కార్యకర్తలు కిలోమీటర్ మేర భారీ ర్యాలీ నిర్వహించారు. నరేంద్రమోదీ, బీజేపీ వ్యతిరేక నినాదాలతో షాహీదీ చౌక్ దద్దరిల్లిపోయింది.