జాతీయ వార్తలు

దేశ భద్రతలో మోదీ రాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, సెప్టెంబర్ 8: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ అధినాయకత్వం వౌనం దాల్చడంపై కాంగ్రెస్ శనివారం మరోసారి మండిపడింది. దేశ భద్రతలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజీపడిపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తీవ్రంగా విమర్శించారు. యుపీఏ హయాంలో భారత వైమానిక దళం ఆమోదం తెలిపిన తరువాతే ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందం చేసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చాక రాఫెల్ యుద్ధ విమానాల ధరలు అమాంతం పెంచేశారని, దీని వెనకు భారీ కుంభకోణం ఉందని సుర్జేవాలా ఆరోపించారు. రాఫెల్ కుంభకోణంపై ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ జాతికి వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు. ‘కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో రాజీపడింది’అని రణ్‌దీప్ అన్నారు. సాంకేతిక అవసరాలు, సామర్ధ్యాన్ని సమగ్రంగా పరిశీలించిన తరువాత యుపీఏ ప్రభుత్వం రాఫెల్ ఒప్పందం ఖరారు చేసిందని ఆయన తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వం విమానాల ధరలు పెంచేయడం వల్ల 41వేల కోట్ల రూపాయల ప్రజాధనం నష్టపోవల్సి వస్తోందని ఆయన చెప్పారు. అయితే ఒప్పందం ఉల్లంఘన జరగలేదని సాంకేతి బదిలీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం చెప్పడం పచ్చి అబద్ధమని ఆయన విమర్శించారు. కుంభకోణపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌కు కేంద్రం అంగీకరించపోవడం దేని సంకేతమని సుర్జేవాలా ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మానసరోవర్ యాత్రపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఆయన అన్నారు. యాత్రలు, ఆలయాలకు వెళ్లే హక్కు పౌరులందరికీ ఉందన్న విషయం కమలనాథులు తెలుసుకోవాలని ఆయన అన్నారు.