జాతీయ వార్తలు

వ్యూహం మార్చనున్న ఆర్మీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహంలో మార్పులు తేవాలని ఆర్మీ భావిస్తోంది. మణిపూర్‌లో సాయుధ తిరుగుబాట్లు ఎక్కువగా ఉన్నాయి. దేశ భద్రత కోసం పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో జవాన్లు అమరులవుతున్నారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదుల ఏరివేతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై సిబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. మణిపూర్‌లో దాదాపు 10 వరకు తీవ్రవాద గ్రూపులున్నాయి. ఇవన్నీ చురుకుగా పనిచేస్తున్నాయి.
సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో ఆర్మీ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు చేస్తోంది. మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న ఎన్‌కౌంటర్లపై విచారణ చేసి నివేదికలు ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేకసార్లు సీబీఐని ఆదేశించింది. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారనే అభియోగాలపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మణిపూర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అనేకసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మణిపూర్‌లో దాదాపు 1528 వరకు ఎన్‌కౌంటర్లు జరిగాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ విషయమై ఈ ఏడాది జూలైలో సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మను హాజరుకావాలని కూడా కోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా దర్యాప్తును ముగించి నివేదిక ఇవ్వాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2017లో తీవ్రవాదుల దాడుల్లో ఎనిమిది మంది ఆర్మీ జవాన్లు మరణించారు. 26 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఏడాది ఇంతవరకు జరిగిన ఆపరేషన్లలో ఐదుగురు జవాన్లు మరణించగా, 17 మందికి గాయాలయ్యాయి.
1997 నుంచి ఇంతవరకు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యల్లో 1889 మంది జవాన్లు మరణించగా, 3168 మందికి గాయాలయ్యాయి. అదే సమయంలో 4974 మంది తీవ్రవాదులు, చొరబాటుదారులు ఎదురుకాల్పుల్లో మరణించారు. 20 ఏళ్లలో జవాన్లు, పోలీసులు, అస్సాం రైఫిల్స్, తీవ్రవాదులు కలిసి మొత్తం పది వేల మంది మరణించారు. కార్గిల్ యుద్ధంలో 527 మంది జవాన్లు అమరులయ్యారు. 1327 మంది జవాన్లకు గాయాలయ్యాయి. వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లోనే దేశ భద్రత నిమిత్తం విధి నిర్వహణలో పెద్దసంఖ్యలో జవాన్లు అమరులయ్యారు. జమ్ముకాశ్మీర్ తరహాలోనే ఈశాన్య రాష్ట్రాలను సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టం అమలులోంది. దీనివల్ల భద్రతా బలగాలు దేశ భద్రత నిమిత్తం ఎటువంటి వత్తిడి లేకుండా ఆపరేషన్లు నిర్వహించుకోవచ్చు.