జాతీయ వార్తలు

బంద్ ప్రశాంతం.. సంపూర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన భారత్ బంద్ సోమవారం ప్రశాంతంగా జరిగింది. అనేక రాష్ట్రాల్లో పౌరజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తాన్ని బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా సాగింది. బిహార్‌లోని జెహానాబాద్‌లో అంబులెన్స్‌ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఆసుపత్రికి తరలిస్తున్న మూడేళ్ల బాలిక మృతి చెందింది. సకాలంలో వైద్యం అందకే బాలిక మృతి చెందిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఒడిశాలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాంగ్రెస్ నాయకత్వంలోని 21 ప్రతిపక్ష పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్ నుంచి రామ్‌లీలా మైదాన్ వరకూ ప్రతిపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేరళ, కర్నాటక, బిహార్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌లో బంద్ సంపూర్ణంగా జరిగింది. వాహనాలు తిరగలేదు. వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. విద్యా సంస్థలు బంద్ పాటించాయి. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరంలో బంద్ పాక్షికంగా జరిగింది. ఢిల్లీలోని ర్యాలీలో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్‌డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, విభజించి పాలిస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. బంద్‌ను విఫలం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. కాగా రాజధాని ఢిల్లీలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా తెరిచారు. అయితే దర్యాగంజ్, రామ్‌లీలామైదాన్ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నిరసనకారుల నినాదాలతో రెండు ప్రాంతాలూ హోరెత్తిపోయ్యాయి. కాంగ్రెస్ కార్యకర్తలు రైల్‌కోకో చేయడంతో ఒడిషాలో రైళ్ల సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్రంలో పది రైళ్లను రద్దుచేశారు. జాతీయ రహదారులపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకోలతో బస్సులు, టాక్సీలు, ఆటోరిక్షాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
భువనేశ్వర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. హైవేలపై వాహనాలు బారులుతీరాయి. అలాగే ప్రసిద్ధ సూర్యదేవాలయం టికెట్ కౌంటర్‌ను ఆందోళన కారులు మూయించారు. దుకాణాలు, మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థల్లో బంద్ విజయవంతమైంది. బిజూపట్నాయక్ యూనివర్శిటీలో అన్ని పరీక్షలను వాయిదా వేశారు. కేరళలో ప్రతిపక్షాలు హర్తాళ్ వల్ల పౌర జీవనం అస్తవ్యస్తమైంది. ప్రైవేటు, ప్రభుత్వం వాహనాలు ఏవీ రోడ్లపైకి రాలేదు. కాగా తెలంగాణలో భారత్ బంద్‌కు విశ్రమ స్పందన కనిపించింది. బస్సు సర్వీసులను అడ్డుకున్న కాంగ్రెస్, లెఫ్ట్, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌లో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ సహా 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జరగాల్సిన ప్రీ పీహెచ్‌డీ పరీక్షలను ఉస్మానియా యూనివర్శిటీ వాయిదా వేసింది. కాగా బంద్ వల్ల కర్నాటకలో ప్రజలు అవస్థలపాలయ్యాయి. రాజధాని బెంగళూరులో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రభుత్వ బస్సులు, టాక్సీలు, ఆటోరిక్షాలు తిరగలేదు. షాపింగ్ మాల్స్, దుకాణాలు, ప్రైవేటు కంపెనీలు మూతబడ్డాయి.
కేఆర్‌సీటీసీ బస్సులతోపాటు సిటీ బస్సులు రోడ్లపైకి రాలేదు. మంగళూరులో బంద్ ఉద్రిక్తంగా మారింది. షాపులు, హోటళ్లపై ఆందోళనకారులు రాళ్లదాడి చేశారు. జార్ఘండ్‌లో బంద్ చేయిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో బంద్ ప్రభావం కనిపించలేదు. పరీక్షలు యధావిధిగా జరిగాయి. కాలేజీలు, స్కూళ్లు పనిచేశాయి. జాదవ్‌పూర్ స్టేషన్‌లో కాసేపుబైఠాయింపు జరిగింది. దక్షిణాది తమిళనాడులో బంద్ పాక్షికంగా జరిగింది.
కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ఇవ్వడంతో ఆటోరిక్షాలు రోడ్లపై తిరగలేదు. సిటీ బస్సులు నడిచాయని, అయితే కేరళ వైపువెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దుచేసినట్టు అధికారులు వెల్లడించారు. బిహార్‌లో బంద్ హింసాత్మకంగా మారింది. రాళ్ల దాడులు, దహనకాండలు చోటుచేసుకున్నాయి. రహదారులపై వాహనాలు కనిపించలేదు. పాట్నా రోడ్లపై, రైల్వే ట్రాక్‌లపై ఆందోళనకారులు టైర్లు తగలబెట్టారు. పాఠశాలలు, మాల్స్ మూతబడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పనిచేశాయని అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌ల్ పూర్తి బంద్ జరిగింది. వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మూతబడ్డాయి. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. పలుచోట్ల నిరసనకారులు రాళ్ల దాడికి దిగారు. కాంగ్రెస్ పాలిత మిజోరంలో బంద్ ప్రశాంతగా జరిగింది.

చిత్రం..భారత్ బంద్ సందర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్