వరంగల్

టీకా వికటించి పసిబిడ్డ మృతి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, సెప్టెంబర్ 12: కేసము ద్రం మండలం భుక్యారాంతండాలో టీకా వికటించి నెలన్నర వయసు గల చిన్నారి మృతి చెందినట్లు తండావాసు లు ఆరోపిస్తున్నారు. తండావాసులు, చిన్నారి తల్లిదండ్రులు నునావత్ ముర ళి, సావిత్రి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. నెలన్నర వయసు గల తమ కుమార్తెకు బుధవారం మహమూద్‌పట్నం కాలనీతండాలో టీకాలు వేయించేందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది తమ బిడ్డకు 45 రోజులకు వేయాల్సిన 2 టీకాల్లో ఒకటి తొంటికి, మరోటి చేతికి ఇచ్చిందన్నారు. తరువాత తమ బిడ్డను ఇంటికి తీసుకొచ్చామని తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నిద్రలో జారుకున్న పాప రాత్రి 7 గంటల వరకు కూడా లేవకపోవడంతో అనుమానం వచ్చి తట్టిలేపినా చలనం లేక పోవడం, చుట్టుపక్కల వాళ్లు వచ్చి బిడ్డ నాడి చూసి చనిపోయినట్లు నిర్ధారించారన్నారు. టీకా వేయించక ముందు ఎలాంటి ఆనారోగ్యానికి గురికాలేదని, తమ బిడ్డకు ఇచ్చిన టీకా వికటించి మృతి చెందిందని ఆరోపించారు. కాగా టీకా వికటించినట్లయితే కేవలం అరగంటలోనే ఒంటిపై దద్దుర్లు వస్తాయని, ఒక్కసారిగా విపరీతమైన జ్వరం వస్తుందని, ఈ పాపకు అలాంటి ఆనవాళ్లు లేవని, పాప మృతికి టీకా కారణం కాకపోవచ్చని వైద్య వర్గాలు వెళ్లడించాయి. కాగా పాప మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలగలబోయిన వెంకన్న తెలిపారు.

కేసీఆర్‌వి గారడీ మాటలు: శ్రీ్ధర్‌బాబు
మహదేవపూర్, సెప్టెంబర్ 12: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మాట్లాడే మాటలు గారడీ మాటలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు అన్నారు. బుధవారం మహదేవపూర్ మండల విసృత స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోస పూరిత వాగ్ధానాలను చేస్తూ తెలంగాణ ప్రజల ను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులకు మూడు ఎకరాల భూమి, రైతుకు ఒకే దఫా రుణాలను మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ డబుల్ బెడ్‌రూంల నిర్మాణం, ఇంటింటికి గోదావరి నీరు ఇస్తానని మోస పూరితమైన వాగ్ధానాలను చేసి వాటిని నేరవేర్చలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వాగ్ధానాలను నిలుపుకోలేని కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో సైతం భూములు దారదత్తం చేసిన రైతులకు నష్ట పరిహారం విషయంలో అన్యా యం చేశారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో మంథిని నియోజకవర్గం నుండి తనను ఆశీర్వాదించి కాం గ్రెస్ పార్టీ గెలుపుకు కృషిచేయాలని కోరారు. మండలంలో శక్తి యాప్ నమోదులో ముందు వరసలో నిలిచిందని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ జెండా అవిష్కరణలో భాగంగా జెండాలను అవిష్కరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి, జెడ్పీటీసీ ఆసీనాబా ణు, మంథిని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విలాస్‌రావు, మాజీ సర్పంచ్ రాజబాపు, మాజీ ఎంపీపీ అక్బర్‌ఖాన్‌పాల్గొన్నారు.