హైదరాబాద్

ఎవరికెన్ని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మహానగరంలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లను పంచుకునేందుకు ప్రధాన పార్టీలు నానా పాట్లు పడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్, దాని ఫ్రెండ్లీ మజ్లిస్ పార్టీ, పొత్తుతో పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ఏ నియోజకవర్గం ఏ పార్టీకి కేటాయించాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల ప్రాతిపదికన టికెట్లను కేటాయించాలని భావిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 సీట్లకు సంబంధించిన టికెట్ల కేటాయింపునకు సంబంధించి ఇప్పటికే ఒక సారి టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక అధికార పార్టీ, దాని ఫ్రెండ్లీ పార్టీకి సంబంధించి టీఆర్‌ఎస్ అంబర్‌పేట, ఖైరతాబాద్ పార్టీల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం మజ్లీస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాల్లో చార్మినార్ మినహా మిగిలిన నియోజకవర్గాలను సిట్టింగ్‌లకే కేటాయించారు. ఇక టీఆర్‌ఎస్ గోషామహల్ టికెట్‌ను మాజీ మంత్రి దానం నాగేందర్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అధికార పార్టీకి సంబంధించి రెండు నియోజకవర్గాల మినహా గ్రేటర్ సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైనట్టే. ఇక కాంగ్రెస్, టీడీపీ పార్టీల పొత్తుల వ్యవహారంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. కాంగ్రెస్ సనత్‌నగర్, గోషామహల్ నియోజకవర్గాలు కావాలని పట్టుబట్టడంతో, ఆ రెండు నియోజకవర్గాల్లో తమకున్న క్యాడర్ ఏమిటీ? కాంగ్రెస్‌కు కేటాయిస్తే పరిస్థితులెలా ఉంటాయన్న అంశంపై టీడీపీ నేతలు చేస్తున్న కసరత్తు రేపో, మాపో కొలిక్కిరానుంది. పొత్తులు కుదుర్చుకుంటున్న పార్టీలు నియోజకవర్గాల వారీగా తమకున్న బలాన్ని, ఆశావాహుల్లో గెలుపుగుర్రాలు, వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ పట్టును పరిగణలోకి తీసుకుని గెలుపే లక్ష్యంగా వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు. రాజేంద్రనగర్ నియోకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్‌ను ఖరారు చేసింది. టీఆర్‌ఎస్‌కి ఫ్రెండ్లీ పార్టీ అయిన మజ్లిస్ అధికారపార్టీ అభ్యర్థి గెలుపు సాధ్యాసాధ్యాలపై అంఛనాలు వేస్తోంది. మైనారిటీ ఓట్లు అధికార పార్టీకి దక్కే అవకాశముందా? అలాంటి పరిస్థితుల్లేనపుడు మజ్లిస్ అభ్యర్థిని బరిలో దింపి ఆ ఓట్లను చీల్చే దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గంలో నెలకొంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి ముఖేష్, దానం నాగేందర్ బరిలో నిలిచే అవకాశముండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ కావటంతో ఒక వర్గం ప్రజల ఓట్లు మూడుగా చీలి, నాలుగో అభ్యర్థికి ప్రయోజనం చేకూరే అవకాశముంటే, ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహాంపై మజ్లిస్, టీఆర్‌ఎస్ నేతలు సమష్టి కసరత్తు చేస్తున్నారు.