జాతీయ వార్తలు

నవాజ్‌కు అంత లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 21: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు జైలు నుంచి విడుదలకు సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం, సౌదీ అరేబియా ప్రభుత్వం మధ్య ఎలాంటి డీల్(ఒప్పందం) జరగలేదని ఓ మంత్రి వివరించారు. అవినీతి కేసులో జైలుశిక్ష పడ్డ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, కుటుంబ సభ్యులను విడుదల చేయాలని పాక్ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం, అల్లుడు, రిటైర్డ్ కెప్టెన్ మహమద్ సఫ్దర్ జైలుకెళ్లారు. బుధవారం ఇస్లామాబాద్ హైకోర్టు కింది కోర్టు తీర్పును రద్దుచేసింది. దీంతో నవాజ్, కుమార్తె, అల్లుడు రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి విడుదల అయ్యారు.‘ఏ దేశం కూడా నవాజ్ షరీఫ్‌ను విడుదల చేయమని అడగలేదు. సౌదీ అరేబియాకు ఆయన అవసరం ఎంతమాత్రం లేదు. కాబట్టి ఇరుదేశాల మధ్య డీల్ అన్నదే అప్రస్తుతం’అని పాక్ సమాచార మంత్రి ఫావద్ చౌదరి వెల్లడించారు. సౌదీ అరేబియాతో పెట్టుకున్న డీల్ వల్లే మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్, ఆయన కుటుంబ సభ్యులు శిక్ష నుంచి విముక్తి పొందారన్న వార్తలను మంత్రి కొట్టిపారేశారు. ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వంలోని ప్రభుత్వం, రియాద్ ప్రభుత్వం ఒప్పందంలో భాగమే నవాజ్ విడుదల అంటూ వచ్చిన కథనాలను మంత్రి ఖండించారు. నవాజ్ షరీఫ్, మరియం, సఫ్దర్‌కు అనుకూలంగా ఇస్లామాబాద్ కోర్టు తీర్పును ఇచ్చే సమయంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సౌదీ అరేబియాలో పర్యటన ఉండడం తో ‘డీల్’ వందతులు వచ్చాయి. సౌదీ ప్రభుత్వం అభ్యర్థన వల్లే నవాజ్, కుటుంబ సభ్యులను విడుదల చేశారన్న కథనాలు డాన్ పత్రికలో వచ్చాయి. 2000లో పాకిస్తాన్, సౌదీ అరేబియా ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందాన్ని మీడియా ఉటంకిస్తోంది. అప్పట్లో నవాజ్ షరీఫ్ కుటుంబం, సైనిక నియంత ముషారఫ్ మధ్య కుదిరిన డీల్‌కు సౌదీ ప్రభుత్వమే గ్యారంటర్‌గా ఉంది. ముషారఫ్‌తో సౌదీ ప్రభుత్వం ఒప్పందం వల్లే షరీప్ నుంచి జైలు నుంచి విడుదల చేయడం, విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వడం జరిగింది.
పాకిస్తాన్‌కు సౌదీ అరేబియాకు దీర్ఘకాలంగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ కొత్త అధినేతగా ఎవరు ఎన్నికైనా ముందుగా గల్ఫ్ దేశాల్లోనే పర్యటించడం జరుగుతుంది. కాగా ఇమ్రాన్‌ఖాన్ తాజా సౌదీ అరేబియా పర్యటనలో నవాజ్ షరీఫ్ అంశం చర్చకే రాలేదని పాక్ మంత్రి వెల్లడించారు.‘ఆయన ఏమంత ప్రాధాన్యత ఉన్న నాయకుడు కాదు. పనిగట్టుకుని ఇమ్రాన్ చర్చించడానికి‘అని నవాజ్‌ను ఉద్దేశించి షరీఫ్ వ్యాఖ్యానించారు. కాబట్టి సౌదీ అరేబియాతో డీల్ లేదు ధీల్(కన్‌సెషన్)లేదు అని సమాచార మంత్రి చలోక్తి విసిరారు.